Karnataka: దక్షణ భారత సినీ ఇండస్ట్రీలో భాషల్లో నటించిన నటుడు ప్రకాష్ రాజ్. సినిమాల్లోనే కాక రాజకీయ విమర్శల్లో కూడా చురుకుగా ఉంటారు ప్రకాష్ రాజ్ . దక్షణ భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జనాలను, స్టూడెంట్స్ ను కలిస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య కర్ణాటక లోని శివమెగ్గలోని ఎం విశ్వేశ్వరయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని ఆగస్టు 8న సందర్శించారు. ఆ కాలేజీ క్యాంపస్ లోని హాల్ లో జరిగిన కార్య క్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు. థియేటర్ - సినిమా మరియు సమాజం అనే అంశాలపై పైన జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ప్రసంగించి ప్రోగ్రామ్ అయ్యాక అక్కడి నుండి వెళ్లిపోయారు.
అంతా సబబు గానే ముగిసిన తరువాత.. ఆ కాలేజీ విద్యార్థులు నటుడు ప్రకాష్ రాజ్ వెళ్లిన తరువాత కాలేజీ మొత్తాన్నీ గోమూత్రంతో శుద్ధి చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ నుండి చూసి మేము నేర్చుకునేది ఏమి లేదని విద్యార్థులు వాపోయారు. స్థానికంగా అక్కడ ఉన్న తుక్డే గ్యాంగ్ ప్రకాష్ రాజ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి విద్యార్థులకు అక్కడి బీజేపీ పార్టీ నాయకులు సపోర్ట్ చేసారని.. వారి సాయంతోనే విద్యార్థులు అలా చేసారని తెలిసింది.
కాలేజీ చుట్టూ పక్కలా జరిగిన ఆందోళనలను.. బయటి వ్యక్తుల సాయంతోనే విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. కాగా.. విద్యార్థులకు సపోర్ట్ చేసిన వ్యక్తుల గురించి మాత్రం శివమెగ్గ పోలీసులు ఎలాంటి సమాచారం మీడియాకి ఇవ్వలేదు. అయితే సౌత్ ఇండస్టీలో పాపులారిటీ సంపాదించిన ప్రకాష్ రాజ్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ పై విమర్శలు చేస్తున్న సంగతి విషయమే తెలిసిందే. ప్రకాష్ రాజ్ సందర్శించిన తరువాత విద్యార్థులు గోమూత్రంతో కాలేజీ పరిసర ప్రాంతాలను శుద్ధి చేయటంతో అక్కడ వివాదం నెలకొంది. వాటికి సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింలో వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
నటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన కాలేజీని గోమూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు