Bank Account Minimum Balance Charges: తమ వినియోగదారులకు బ్యాంకులు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్ని సేవలు ఉచితంగా లభించవు. కొన్ని సేవలు అందించినందుకు కస్టమర్ల నుంచి ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేస్తాయి. బ్యాంకుల నిబంధనల విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. నిబంధనలు ఏ మాత్రం క్రాస్ చేసిన ఛార్జీల మోత ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా.. ఏటీఎంల్లో నగదు లావాదేవీలు లిమిట్ దాటినా, బ్యాలెన్స్ లేదా ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయినా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇక చెక్‌బుక్ సర్వీసులు, ఎస్‌ఎంఎస్ సర్వీస్, డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు వంటి వాటికి కూడా కస్టమర్లపై భారం పడుతుంటుంది.
మినిమమ్ బ్యాలెన్స్, ఏటీఎం సర్వీసులు, ఎస్‌ఎంఎస్ సేవలపై అదనపు లావాదేవీలపై 2018 నుంచి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు కస్టమర్ల నుంచి రూ.35,587.68 కోట్లు వసూలు చేశాయని ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానంలో వెల్లడించింది. ఇలా బ్యాంకులకు ఛార్జీలు చెల్లించిన వారిలో మీ పేరు కూడా ఉండొచ్చు. ఆసక్తికరంగా మార్చి 2020 నుంచి దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు జరిమానాను మాఫీ చేయడం విశేషం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నిబంధనల ప్రకారం సేవింగ్స్ అకౌంట్స్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే జరిమానా ఛార్జీలను నిర్ణయించడానికి బ్యాంకులకు అనుమతి ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ రాజ్యసభలో తెలిపారు. కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించనందుకు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు విధించే ఛార్జీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, ఎస్‌ఎంఎస్ సేవల కోసం వసూలు చేసే మొత్తం మొత్తం గురించి సమాచారం ఇవ్వాలని ఎంపీ డాక్టర్ అమీ యాజ్నిక్ కోరారు. బ్యాంకులు విధించే సర్వీస్ ఛార్జీల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను, బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలను నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నదా..? అని ఆయన ప్రశ్నించారు.
ఇందుకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పంపడానికి బ్యాంకులు విధించే ఛార్జీలు సమానంగా ఉండేలా చూడాలని.. వారికి అందుబాటులో ఉన్న సాంకేతికతను, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఉపయోగించుకోవాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించినట్లు చెప్పారు. సేవల వినియోగం ఆధారంగా వినియోగదారులందరిపై ఛార్జీలు విధిస్తున్నాయని తెలిపారు.
Also Read: Asian Champions Trophy 2023: పాకిస్థాన్ పై గెలిచి.. సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..
Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Minimum Balance Charges: మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయట్లేదా..? బ్యాంకులు ఛార్జీల మోత.. రూ.35 వేల కోట్లు వసూలు..!