White Hair To Black Hair Naturally In 2 Steps: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తరచుగా హెయిర్ డైలను వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్‌నే ఎక్కువ వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు కొబ్బరి నూనె, సోంపు మిశ్రమం కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని మిశ్రమంలా తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
సోంపు, కొబ్బరి నూనె మిశ్రమం:
వయస్సు పెరిగే కొద్దీ చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌కి బదులుగా సోంపు, కొబ్బరి నూనె మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం ముందుగా మీరు సోంపును పొడిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిని నూనెలో వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేసి 25 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి..శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.
ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్
కలోంజీ-కొబ్బరి నూనె మిశ్రమం:
కలోంజీ సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆరోగ్య నిపుణులు తరచుగా వీటిని ఆహారంలో తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఇవి శరీరానికే కాకుండా జుట్టుకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు సులభంగా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జుట్టును కుదుళ్ల నుంచి దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ గిన్నెను సన్నని మంటపై పెట్టి మరిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూనెను ఫిల్టర్ చేయాలి. ఇలా ఫిల్టర్ చేసిన నూనెను స్కాల్ప్‌కు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నల్లగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి