How To Get Rid Of Back Pain Instantly: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకే చోట కూర్చోవడం, శరీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మందిలో వెన్ను నొప్పులు వస్తున్నాయి. దీని కారణంగా కొందరిలో నడుము నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తరచుగా వెన్ను నొప్పులతో బాధపడేవారు విటమిన్లు, కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ కింది ఆహారాలు కూడా ప్రతి రోజు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వెన్నునొప్పిలతో బాధపడేవారు ఈ ఆహారాలు తప్పకుండి తీసుకోండి:
ఆకు కూరలు:
ఆకు కూరల్లో శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్‌తో పాటు అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా పచ్చి ఆకు కూరలను తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా వెన్నునొప్పులు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా క్యాబేజీ, మెంతికూర, పాలకూర ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
డార్క్ చాక్లెట్:
వెన్నునొప్పి కారణంగా చాలా మంది ఆఫీసుల్లో పనులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి డార్క్ చాక్లెట్ కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
గుడ్లు:
గుడ్లు శరీర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలా మంది ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా గుడ్లను తీసుకుంటారు. ఇందులో కాల్షియం, విటమిన్ డి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల వెన్ను నొప్పుల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
అల్లం:
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వెన్ను నొప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అల్లంతో తయారు చేసిన కషాయం కూడా ఈ నొప్పుల నుంచి ప్రభావంతంగా ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి