Chandrayaan 3 Live Updates: చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్ వీడియో చూశారా..!

Chandrayaan-3 Landing Live Updates: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చరిత్ర ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న నేపథ్యంలో అందరికీ కళ్లు ఇస్రోపైనే ఉన్నాయి. చంద్రయాన్-3 లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Written by - Ashok Krindinti | Last Updated : Aug 23, 2023, 06:38 PM IST
Chandrayaan 3 Live Updates: చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్ వీడియో చూశారా..!
Live Blog

Chandrayaan 3 Moon Landing Live: యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్షణం మరికాసేపట్లో ఆవిషృతం కానుంది. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3.. ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగు పెట్టే క్షణం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. చరిత్ర పుటల్లో భారత్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కానుంది. అంతకుముందే 5:45కి ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. 
 

23 August, 2023

  • 18:37 PM

    చంద్రయాన్ విజయంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. 1962లో ప్రారంభమైన భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఈరోజు చంద్రయాన్ 3 రూపంలో కొత్త ఎత్తును నెలకొల్పిందని అన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమం ఈ అద్భుతమైన ప్రయాణంపై దేశం మొత్తం నేడు గర్విస్తోందన్నారు. దేశప్రజలందరికీ ఇది సంతోషకరమైన క్షణం అని.. శాస్త్రవేత్తలు, దేశప్రజలందరికీ అభినందనలు తెలిపారు.

     

  • 18:33 PM

    చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చప్పట్లు అభినందనలు తెలిపారు.

     

  • 18:15 PM

    చంద్రయాన్-3 సక్సెస్‌పై ఇస్రో ట్వీట్
     

  • 18:07 PM

    చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ మాట్లాడుతూ.. భారత్ గుప్పిట్లో ఇప్పుడు చంద్రుని దక్షిణ ధృవం మీద ఉందని అన్నారు.

  • 18:07 PM

    చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ మాట్లాడుతూ.. భారత్ గుప్పిట్లో ఇప్పుడు చంద్రుని దక్షిణ ధృవం మీద ఉందని అన్నారు.

  • 18:06 PM

    చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. 

  • 18:05 PM

    చంద్రయాన్-3 సక్సెస్ అయింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది.
     

  • 17:55 PM

    చంద్రయాన్-3 ల్యాండర్ ప్రాథమిక ల్యాండింగ్ సైట్ 69.367621°S అక్షాంశం, 32.348126°E రేఖాంశం వద్ద ఉంది. ఇది చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉంది.
     

  • 17:53 PM

    ఇప్పటివరకు అంతా ప్రక్రియలో జరుగుతోంది. ల్యాండింగ్‌కు 50 శాతం ప్రయాణం పూర్తయింది. మరికొద్ది క్షణాల్లో భారత్ చరిత్ర సృష్టించబోతోంది. ల్యాండర్ చంద్రుడికి 22 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. 

  • 17:52 PM

    చంద్రయాన్-3 ప్రయోగం, ల్యాండింగ్ మధ్య ప్రయాణాన్ని వివరిస్తూ.. ల్యాండర్ మాడ్యూల్ భూమి చుట్టూ 21 సార్లు, చంద్రుడు 120 సార్లు కక్ష్యలో తిరిగినట్లు ఇస్రో తెలిపింది. 
     

  • 17:47 PM

    ల్యాండింగ్ ప్రాంతానికి చంద్రయాన్

    చంద్రయాన్-3 ల్యాండింగ్ అత్యంత కీలక దశ మొదలైంది. సాయంత్రం గం.5:44 ని.లకు విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై ల్యాండింగ్ నిర్దేశిత ప్రాంతం పైకి చేరింది. ఇప్పటి నుంచి ల్యాండింగ్‌కు గల టైమ్‌ను '17 మినిట్స్ ఆఫ్ టెర్రర్'గా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. గం.కు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఇప్పుడు జీరో స్పీడ్‌కు కంట్రోల్ చేసి 'విక్రమ్'ను ల్యాండ్ చేయడమే అసలైన సవాల్. ఇది ఇప్పుడు మొదలైంది.

  • 17:46 PM

    చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండిగ్‌ను చూసేందుకు ఢిల్లీలోని సీఎస్‌ఐఆర్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హాజరయ్యారు.

     

Trending News