ఏ సీజన్లోనైనా చటుక్కున దొరికే ఆకుకూర.. తోరకూర. తెలుగు రాష్ట్రాలతో సహా దేశం అంతటా ఈ ఆకుకూరను విరివిగా పెంచుతారు, తింటారు. ఆకుకూరల్లో ఇది 'రాణి' వంటిదని అంటారు. యాంత్రిక జీవనానికి అలవాటుపడి తోటకూర రుచి, దాని ఉపయోగాలేంటో చాలామందికి తెలియడం లేదు. తాజా తోటకూరలో ఉండే పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు. అందుకే తరచూ కాస్త తోటకూర తింటూ ఉండండని డాక్టర్లు చెబుతూ ఉంటారు.
తోటకూర- లాభాలు
* తోటకూర మంచి విరోచనకారి. ఆకలిని పుట్టిస్తుంది. ఇందులోని పీచు పదార్ధం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
* ఇందులో ఏ,బి,సి,కే విటమిన్లు,కాల్షియం,పొటాషియం, జింక్ వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడుతుంది.
* పాలు తాగితే జీర్ణం అవ్వనివారు తోటకూర తింటే జీర్ణమవుతుంది. పాల ద్వారా అందాల్సిన కాల్షియం తోటకూర అందిస్తుంది.
* మధుమేహ వ్యాధిగస్తులకు తోటకూర చక్కటి ఔషధం. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది.. నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిమితంగా ఉంచడంలో తోటకూర దోహదపడుతుంది.
* ఇది వ్యాధి నిరోధకకారిణి. నోటి సమస్య, చిగుళ్ల వాపు, దంతాల సమస్యను నివారిస్తుంది.
* బీపీ ని క్రమబద్దీకరిస్తుంది. బరువు తగ్గాలనుకొనేవారికి తోటకూర చక్కటి పరిష్కారం.
* జుట్టు రాలకుండా ఉండటానికి, చుండ్రు తగ్గటానికి.. మిక్సీ లో తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బుకొని తలకు రుద్దుకోవాలి. ఫలితం ఉంటుంది.
* అధిక ప్రోటీన్లు శరీరానికి అందాలంటే తోటకూరను వేపుడు చేసుకొని తినే బదులు వండుకొని తిన్న కూర అయితే బెటర్.