Grah Gochar 2023: అక్టోబర్ 30న రాహు-కేతు రాశి మార్పు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..

Grah Gochar 2023: ఈ నెల చివరిలో రాహు, కేతు గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు మూడు రాశులవారికి ఊహించని లాభాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 01:24 PM IST
Grah Gochar 2023: అక్టోబర్ 30న రాహు-కేతు రాశి మార్పు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..

Rahu Ketu Gochar 2023 October:  ఆస్ట్రాలజీలో రాహు, కేతువులను ఛాయా గ్రహాలు, దుష్ట గ్రహాలు, పాప గ్రహాలు అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఈ రెండు గ్రహాలు 18 నెలలకొకసారి రాశిని మారుస్తాయి. అక్టోబరు 30న రాహువు మేషరాశిని వదిలి మీనరాశిలోకి, కేతు గ్రహం తులరాశిని విడిచి కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఇవీ ఎప్పుడు తిరోగమన దిశలోనే సంచరిస్తూ ఉంటాయి. ఈ రెండు గ్రహాల రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రాహు-కేతువుల సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిథున రాశి: రాహు, కేతువుల సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బిజనెస్ చేసేవారు భారీగా లాభపడతారు. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. 

మేషం: ఇదే రాశిని విడిచిపెట్టి రాహువు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మేషరాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు డబ్బును భారీగా ఆదా చేస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. 

వృషభం: ఈరాశి వారికి రాహు, కేతువుల రాశి మార్పు అనుకూలంగా ఉంటుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పాత పెట్టుబడులు మీకు లాభిస్తాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. 

Also Read: Guru Vakri 2023 in Aries: బృహస్పతి కదలికలతో ఈ 4 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News