ODI World Cup, ENG vs BAN: వన్డే వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆ జట్టు.. రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు 137 పరుగుల తేడాతో బంగ్లాపై గెలిచింది. డేవిడ్ మలన్ సెంచరీతో అదరగొట్టాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు బెయిర్ స్టో, మలన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మెుదటి నుంచి దూకుడుగా ఆడిన ఇంగ్లీష్ బ్యాటర్లు బంగ్లా బౌలర్లుకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో బెయిర్ స్టో, మలన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 52 పరుగలు వద్ద బెయిర్ స్టో ఔటయ్యాడు. అనంతరం మలన్ తో జత కట్టిన రూట్ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ అద్భుతమైమ పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో మలన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రూట్(82) కూడా అర్ధశతకం సాధించారు.
శతకం పూర్తయిన తర్వాత మలన్ మరింత రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు మలన్. అనంతరం క్రీజులోకి వచ్చి రాగానే సిక్స్ కొట్టాడు కెప్టెన్ బట్లర్. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోరు చూస్తే స్కోరు బోర్డు 400 దాటుతుందని అందరూ భావించారు. కానీ బంగ్లా బౌలర్లు చివర్లో బాగానే కళ్లెం వేశారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 364 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 4 వికెట్లు తీశాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (76), ముష్ఫికర్ రహీమ్ (51), తోహిద్ హ్రిదోయ్ (39) మినహా మిగతావారు ఎవరూ పెద్దగా ఆడలేదు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లే బంగ్లా జట్టును దెబ్బతీశాడు. టాప్లే నాలుగు కీలక వికెట్లును తీశాడు. కెప్టెన్ షకీబుల్ హసన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
Also Read: World Cup 2023: ఆ టాప్ బ్యాటర్‌కు డెంగ్యూ, పాక్ మ్యాచ్‌కు కూడా దూరమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook