BJP Jana Garjana Sabha: 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్‌కు ప్రజలు అవకాశం ఇచ్చినా అభివృద్ధి మాత్రం చేయలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. హుజూరాబాద్ జనగర్జన సభలో మాట్లాడిన ఆయన.. నాడు కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్య కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని విమర్శించారు.
"ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ స్వామిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కరికి భూమి హక్కులు లభించాయి. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించింది. కాంగ్రెస్ హయాంలో పేదలకు రూపాయి ఇస్తే.. 20 పైసలు మాత్రమే వారి దగ్గరకు చేరాయి. అదే మోదీ ప్రభుత్వలో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయటం ద్వారా అవినీతి తుడిచిపెట్టుకుపోయింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే.
కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేరు. అందుకే అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీలు కుల, మత, ప్రాంత, వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు.. బేకారు అవుతుంది. బీఆర్ఎస్ కారు.. బేకారే.. ప్రజలు హ్యాండ్ ఇవ్వడం ఖాయం. రాబోయే రోజుల్లో తెలంగాణలో BJP అధికారంలోకి రావడం ఖాయం. లక్ష్మీదేవి కమలంపై కూర్చుంటుంది.. కమలం గుర్తుకు ఓటేస్తే అంతా శుభమే జరుగుతుంది.." అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
హుజూరాబాద్ గుండె చప్పుడు ఈటల రాజేందర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేశామని.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరాటం చేశాని చెప్పారు. కానీ 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనను చూశామని.. ఇప్పడు కల్వకుంట్లు కుటుంబ పాలనను చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనను చూశామని.. ఇప్పుడు కేసీఆర్ పార్టీది అదే విధానని మండిపడ్డారు. ఈ పార్టీలు అనేక ఏళ్ళుగా పాలన చేస్తూ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణకు ఏం చేయలేదన్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా.. బీఆర్ఎస్‌కు ప్రజలు ఓట్లు వేయరని.. తెలంగాణ ప్రజలను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లక తప్పదన్నారు.
ఇది కూడా చదవండి : PPF Account 2023: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ
ఇది కూడా చదవండి : Nawab Movie: యాక్షన్ థ్రిల్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నవాబ్ మూవీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ పోస్టర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.