David Warner: వరల్డ్‌కప్‌లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ను సాధించిన డేవిడ్ వార్నర్

David Warner: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫీట్  సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 10:13 PM IST
David Warner: వరల్డ్‌కప్‌లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ను సాధించిన డేవిడ్ వార్నర్

Australia vs Pakistan Match Highlights: వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌ చరిత్రలో ఎవరికి సాధ్యంకాని రికార్డును వార్నర్ తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో మూడు సార్లు 150పైచిలుకు స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా డేవిడ్ భాయ్ నిలిచాడు. వార్నర్ ఒక్కడే ఈ ఫీట్‌ మూడు సార్లు నమోదు చేయగా.. మరే ప్లేయర్‌ కనీసం రెండు సార్లు కూడా 150 ప్లస్‌ స్కోర్లును చేయలేకపోయారు. తాజాగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ ఈ రికార్డు సృష్టించాడు. 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్,  మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్ లతో 163 పరుగులు చేయగా... బర్త్ డే భాయ్ మార్స్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులతో 121 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం ఛేదనను ప్రారంభించిన పాకిస్తాన్ కూడా దీటుగానే బదులిస్తోంది. పాక్ ఓపెనర్లు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షఫీక్ 64 పరుగులు, ఇమామ్ 70 పరుగులు చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ 44 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. ప్రస్తుతం షహీన్ ఆఫ్రిది, హాసన్ అలీ క్రీజులో ఉన్నారు. 

Also Read: Shubman Gill: గిల్ బౌండరీ.. సారా టెండూల్కర్ రియాక్షన్.. కెమెరామెన్ ఫోకస్ మెచ్చుకోవాల్సిందే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News