Unknown Facts About Chandra Mohan: తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న మల్లంపల్లి చంద్రశేఖర రావు గత కొద్దిసేపటి క్రితం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన 1945 మే 23వ తేదీన కృష్ణాజిల్లాలో జన్మించారు. చంద్రమోహన్ ఇప్పటివరకు 200 సినిమాలకు పైగా కథానాయకుడిగా..900 సినిమాలకు పైగా గొప్ప నటుడిగా నటించారు. మొదట తెలుగు చిత్ర పరిశ్రమకు చంద్రమోహన్ 1966 లో రంగులరాట్నం అనే సినిమాతో రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో తనదైన స్టైల్ లో మంచి పాత్ర పోషించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. అప్పటినుంచి చంద్రమోహన్ కథానాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా ఎన్నో పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా ఎన్నో హిట్ అయిన సినిమాలకు ఆయన హీరోగా నిలిచాడు. దీంతోపాటు అప్పుడే హీరోయిన్లుగా రంగ ప్రవేశం చేసిన జయప్రద, శ్రీదేవిల సినిమాలకు హీరోగా నటించే ఛాన్స్ కూడా వచ్చింది. సిరిసిరిమువ్వలో సినిమాలో చంద్రమోహన్ తనదైన పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించాడు. అంతేకాకుండా ఈ సినిమాకు ఆయన నటనకు ఆనాడు ఎన్నో పురస్కారాలు లభించాయి.
చంద్రమోహన్ కి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా 2005 సంవత్సరంలో అతనొక్కడే సినిమాకు గాను నంది పురస్కారం లభించింది. అంతేకాకుండా 2021 సంవత్సరంలో తెలుగు బుక్ ఆఫ్ ది రికార్డ్ లో చోటు కూడా దక్కింది. ఆనాడు ఆయన ఉత్తమ నటనకు గాను రఘుపతి వెంకటయ్య అవార్డు కూడా నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పొందాడు. 2000 సంవత్సరం నుంచి చంద్రమోహన్ ఉత్తమ సహాయ నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా హాస్యనటుడిగా మంచి పేరు పొందాడు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
చంద్రమోహన్ హిట్ మూవీస్ ఇవే:
మొదట చంద్రమోహన్ రంగులరాట్నం అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. ఇదే చిత్రం 1966 లో హిట్టు కొట్టి ఆయనకు మంచి గుర్తింపును అందించింది. ఆ తరువాత బంగారు పిచ్చుక, ఆత్మీయులు అనే రెండు సినిమాలు ఆయనలో ఉన్న మంచి నటుడిని స్క్రీన్ పై కనిపించేలా చేశాయి. చంద్రమోహన్ బొమ్మ బొరుసు అనే సినిమాతో 1971లో మరోసారి మంచి గుర్తింపు పొందాడు. ఇదే సంవత్సరంలో రామాలయం, లాల్ పత్తర్ అనే రెండు సినిమాల ద్వారా మరోసారి తన నటనను నిరూపించుకున్నాడు. 1975లో యశోద కృష్ణ అనే సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక చిత్రాల్లో నటించి గొప్ప పేరు పొందిన వ్యక్తి చంద్రమోహన్..
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook