హిందీ సినిమాల్లో పాడాలని ఉంది: హాలీవుడ్ నటి

హాలీవుడ్ నటి మరియు ప్రముఖ అమెరికన్ సింగర్ సెలెనా గోమెజ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : Sep 17, 2018, 07:26 PM IST
హిందీ సినిమాల్లో పాడాలని ఉంది: హాలీవుడ్ నటి

హాలీవుడ్ నటి మరియు ప్రముఖ అమెరికన్ సింగర్ సెలెనా గోమెజ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే బాలీవుడ్ సినిమాలలో పాడతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. "బాలీవుడ్ సినిమాల్లో పాడేందుకు ఇప్పటి వరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే ఆ సినిమాల్లో పాడడం అనేది ఒక గొప్ప అనుభవంగా నేను భావిస్తాను" అని ఆమె అన్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా హాలీవుడ్ తెరకు పరిచయమైన సెలెనా గోమెజ్  ‘విజార్డ్ ఆఫ్ వేవర్లీ ప్లేస్‌’ అనే డిస్నీ షోతో పేరు సంపాదించుకున్నారు.

బ్యాడ్ లైయర్‌, వాల్వ్స్‌ అండ్ బాక్‌ టు యూ.. వంటి ఆల్బమ్స్‌ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. "నిజం చెప్పాలంటే నాకు పాటలు పాడడం కన్నా నటించడం అంటే ఎంతో ఇష్టం. అయితే నేను నటించిన సినిమాల్లో నేను ఎప్పుడూ పాడలేదు. కాకపోతే సంగీతానికి నా జీవితంలో చాలా గొప్ప స్థానముందని మాత్రం చెప్పగలను. సంగీతం, నటన.. ఈ రెండింటిలోనూ నాకు ప్రావీణ్యం ఉండడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను" అని సెలెనా గోమెజ్ తెలిపారు.

ఇప్పటికి సింగర్‌గా, నటిగా సెలెనా పేరు మీద 11 గిన్నిస్ బుక్ రికార్డులు ఉన్నాయి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొనే సెలెనా.. 2013లో మేక్ ఏ విష్ ఫౌండేషన్ తరఫున క్రిస్ గ్రేసియష్ సెలబ్రిటీ అవార్డు కూడా కైవసం చేసుకున్నారు. ఈమె నటించిన "కమ్ అండ్ గెట్ ఇట్" అనే పాప్ వీడియో.. 2013లో ఉత్తమ పాప్ వీడియోగా ఎంటీవీ అవార్డును కూడా కైవసం చేసుకుంది.

Trending News