Healthy Habits: నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే ఈ 5 అలవాట్లు పాటించాల్సిందే

Healthy Habits: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇవన్నీ జీవనశైలి వల్లనే సంభవిస్తుంటాయి. గత 15-20 ఏళ్లలో జీవనశైలి చాలా మారిపోయింది. తిండి అలవాట్లు మారిపోయాయి. ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వంటివి సాధారణమైపోయాయి. ఈ అలవాట్లు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతున్నాయి. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే ఉదయం వేళల్లో చేసే 5 అలవాట్లు మానుకోవల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 /6

బరువు తగ్గించడం ఉదయం త్వరగా నిద్ర లేచి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవక్రియ వేగవంతమై అధిక బరువు రాకుండా ఉంటుంది. 

2 /6

ఒత్తిడికి దూరం ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల దినచర్య ఆలస్యంగా ప్రారంభమై..ఉరుకులు పరుగులు మొదలౌతాయి. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా పని ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఒత్తిడికి లోనవుతుంటాం. ఈ పరిస్థితి దూరమవ్వాలంటే త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్ర లేవాలి.

3 /6

4 /6

మానసిక సమస్యలకు దూరం ఉదయం త్వరగా లేవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోజువారీ ప్లానింగ్ సరిగ్గా ఉంటుంది. ఫలితంగా మెదడుపై ఒత్తిడి ఉండదు. దాంతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు దూరమౌతుంది. మానసిక సమస్యలు వెంటాడవు.

5 /6

హెల్తీ లంగ్స్ ఉదయం స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికోసం తెల్లవారుజామున ఓపెన్ ఎయిర్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. 

6 /6

హెల్తీ హార్ట్ అనారోగ్యకరమైన జీవనశైలి గుండె వ్యాధులకు కారణమౌతుంది. ఉదయం త్వరగా లేచి వ్యాయామం చేయడం వల్ల గుండె చాలా వరకూ ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది.