Infinix HOT 30i Price: బిగ్ ఇయర్ ఎండ్‌ సేల్‌లో Infinix HOT 30i మొబైల్‌పై 25 శాతంపైగా డిస్కౌంట్‌..రూ.6,499కే పొందండి..

Drop Infinix HOT 30i Price: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ ఇయర్ ఎండ్‌ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాను. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2023, 10:40 AM IST
 Infinix HOT 30i Price: బిగ్ ఇయర్ ఎండ్‌ సేల్‌లో Infinix HOT 30i మొబైల్‌పై 25 శాతంపైగా డిస్కౌంట్‌..రూ.6,499కే పొందండి..

 

Drop Infinix HOT 30i Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకులనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌ సువర్ణ అవకాశమందిస్తోంది. ఇటీవల ప్రముఖ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ విడుదల చేసిన Infinix HOT 30i స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో, ఎంత డిస్కౌంట్‌తో పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ (Infinix HOT 30i) ఫ్లిప్‌కార్ట్‌లో రెండు వేరియంట్లలో లభిస్తోంది. అలాగే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 4GB+64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.9,999 కాగా..ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా 25% తగ్గింపుతో కేవలం రూ.7,499 అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ అదనపు తగ్గింపుతో పొందవచ్చు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

బ్యాంక్ ఆఫర్స్:
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ (Infinix HOT 30i) మొబైల్‌ను అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు HDFC క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్ట్రా రూ.500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌ అందుబాటులో ఉన్నవారు. ఈ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు రూ.1,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు పై కూడా ప్రత్యేకత తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక ఈ బ్యాంక్ ఆఫర్స్ అన్ని పోను ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ మొబైల్ కేవలం రూ.6,499కే పొందవచ్చు. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌(infinix hot 30i specifications):
6.6 అంగుళాల పూర్తి HD ఫుల్ డిస్‌ప్లే
90 Hz రిఫ్రెష్ రేట్
 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ 
గరిష్టంగా 500 నిట్స్‌ సపోర్ట్‌
MediaTek Helio G37 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా XOS 12 OS
AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
10W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News