Loksabha Attack: పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన సరిగ్గా 20 ఏళ్లకు నలుగురు దుండగులు లోక్‌సభ సమావేశాలు జరుగుతుండగా చొరబడి ఎంపీలపై టియర్ గ్యాస్, కలర్ స్మోక్ ప్రయోగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీఆర్పీఎఫ్ ఛీఫ్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ ఏర్పైటైంది.
నిండు లోక్‌సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు దుండగులు ఒక్కసారిగా ఎంపీల గ్యాలరీపై దూకి షూల్లో దాచుకున్న టియర్ గ్యాస్, స్మోక్ క్యాన్లతో దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరో ఇద్దరు పార్లమెంట్ బయట కలర్ గ్యాస్ వదిలి కలకలం రేపారు. ఈ ఘటనపై ఆరుగురు పాల్గొన్నట్టు గుర్తించగా ఐదుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టిని తమవైపు మరల్చి కీలక సమస్యల పరిష్కారం కోసం దాడి చేసినట్టు నిందితులు వివరించినట్టు తెలుస్తోంది. నిరుద్యోగం, రైతు సమస్యలు, మణిపూర్ హింస వంటి అంశాలపై నిందితులు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకే కలర్ స్మోక్ వదిలి తమవైపు దృష్టి మరలేలా చేశామంటున్నారు నిందితులు.
కొన్ని సమస్యల పట్ల నిందితులు తీవ్ర అసహనంతో ఉన్నారని, ఏదో విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ దాడి చేసినట్టు నిందితులు చెప్పారని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భద్రతా ఏజెన్సీలు మాత్రం ఈ దాడి వెనుక మరేదైనా కుట్రకోణుందా అనే దిశగా విచారణ చేపడుతున్నాయని చెప్పారు. అయితే తాము ఏ సంస్థకూ చెందినవాళ్లం కాదని విద్యార్ధులు, నిరుద్యోగులం మాత్రమేనని నిందితులంటున్నారు. తమకు ఉద్యోగాల్లేవని, ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేద్దామనుకుంటే గొంతు నొక్కేస్తున్నారని, అందుకే ఇలా చేసినట్టు నిందితులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ ఫాలో అవుతున్న ఈ నిందితులంతా 18 నెలలుగా దాడి కోసం ప్లాన్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియాలో మహిళా రిజర్వేషన్లు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన పోస్టులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
Also read: Loksabha Attack: పార్లమెంట్ భద్రతా లోపంపై సమగ్ర విచారణకు హోంశాఖ ఆదేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook