Rashmika Mandanna: రష్మిక మందన్న అందాల విందు…సోయగాలతో ఫిదా చేస్తున్న నేషనల్ క్రష్

Rashmika Mandanna in Saree:రష్మిక మందన్నకి నేషనల్ క్రష్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తేనే అర్థమయిపోతుంది…ప్రస్తుతం రష్మిక మందన్న చీర ఫోటోలు వైరల్ అవుతున్నాయి

  • Jan 06, 2024, 20:16 PM IST
1 /6

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న ఆ తరువాత విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమా ద్వారా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ కన్నడ బ్యూటీ కి సౌత్ ఇండియాలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

2 /6

అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా వల్ల సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా తెగ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కూడా నటించే అవకాశం సంపాదించుకుంది.

3 /6

ఇక ఈమధ్య అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ లో గీతాంజలి క్యారెక్టర్ లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

4 /6

ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రష్మికకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె తరచుగా ఇంస్టాగ్రామ్ లో తాను చీరలో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. అందానికే అసూయ తెప్పించేలా తన అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది..

5 /6

ముఖ్యంగా ఈ మధ్య రష్మిక నిమ్మ పండు రంగు చీరలో.. నలుపు చీరలో.. పోయిన సోయగాలు యువతను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని అలరిస్తున్నాయి.

6 /6

రష్మిక మందన్న  ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ లో శ్రీవల్లి క్యారెక్టర్ లో  మరోసారి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ.