Copper Sun Vastu: గ్రహాలకు రాజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంచార సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం సూర్య గ్రహం జనవరి 15న మకర రాశిలోకి సంచారం చేసింది. అందుకే ఈ రోజు మకర సంక్రాంతి జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఈ పండగను భారత దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. దక్షిణ భారతీయులు పొంగల్ అని, గుజరాత్ ప్రజలు ఉత్తరాయణం అని..అస్సోం వారు బిహు అని.. ఇలా ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు.
సనాతన ధర్మంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నదీ స్నానం ఆచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. అంతేకాకుండా సూర్యభగవానుడిని పూజిస్తే.. సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. చాలామంది మకర సంక్రాంతి రోజున రాగితో తయారుచేసిన సూర్యుడిని ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు. ఇలా రాగితో తయారుచేసిన సూర్యుని ఇంటికి కట్టుకోవడం వల్ల ఇంట్లో సంతోషం అదృష్టం పెరుగుతుందని నమ్మకం.. అయితే గుమ్మానికి ఈ రాగి సూర్యుడుని కట్టే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు చిట్కాలు తప్పకుండా పాటించండి:
✤ రాగి సూర్యుడు ఇంటికి తూర్పు దిశలో కట్టడం చాలా శుభ్రమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
✤ వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే గుడి ఈశాన్యం మూలలో రావి సూర్యుడిని కట్టవచ్చు..ఇలా కట్టడం వల్ల అదృష్టం పెరుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఆనందం లభిస్తుంది.
✤ ఇంటి ప్రధాన ద్వారం లేదా కిటికీ రాగి సూర్యుడిని కట్టడం చాలా శ్రేయస్కరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
✤ ముఖ్యంగా ఈ రాగి సూర్యుడిని పెట్టాలనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్ కిటికీలకు కానీ ద్వారానికి కానీ పెట్టకపోవడం చాలా మంచిది.
✤ ముఖ్యంగా లివింగ్ రూమ్ లో ఈ రాగి సూర్యుని ఉంచడం వల్ల అన్ని సమస్యల నుంచి ఉపశమనంభవించి ఇంట్లో నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter