HanuMan OTT and Guntur Kaaram OTT: సంక్రాంతి వస్తే చాలు సినిమాల హడావిడి, సినిమాల పోటీ మొదలైపోతుంది. ఈ సంక్రాంతికి కూడా ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపడ్డాయి. ముందుగా ఈ సంక్రాంతికి ఐదు నుంచి ఆరు సినిమాలు బరిలోకి దిగుతాయి అని అందరూ ఎక్స్పెక్ట్ చేయగా.. థియేటర్లు దొరకక కేవలం నాలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ సొంతం చేసుకోగలిగాయి.
అందులో ముందు నుంచి ఎక్కువ అంచనాలతో వచ్చిన సినిమా మహేష్ బాబు గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేయగా రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో కనిపించారు.
ఇక ఆ తరువాత అంచనాలు ఏర్పరుచుకున్న చిత్రం తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిన్న బడ్జెట్ తో వచ్చిన.. సంక్రాంతికి భారీ విజయం సాధించింది. ఈ సినిమా పైన టీజర్ విడుదలైన దగ్గర నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అవన్నీ రుజువు చేసుకుంటూ థియేటర్స్ లో విడుదలయ్యాక అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషలలో సెన్సేషన్ క్రియేట్ చేసి దాదాపు 250 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది. ఇంకా కూడా ఈ సినిమా జోరు బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గలేదు.
ఇక మరో సినిమా నాగార్జున నా సామి రంగా. వరసగా ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి ఈ చిత్రం పెద్ద రిలీఫ్ గా మిగిలింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సైతం నటించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ట్ గా నిలిచింది.
ఇక చివరిగా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా సైంధవ్. వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం మాత్రం సంక్రాంతి విడుదలైన సినిమాలలో కొంచెం వెనకబడి ఫ్లాప్ గా నిలిచింది. శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాని హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది.
కాగా ఈ చిత్రాల ఓటీటీ డీటెయిల్స్ కి వస్తే ముందుగా సైంధవ్ ఫిబ్రవరి 2 అమెజాన్ ప్రైమ్ లో రావొచ్చని టాక్. ఒకవేళ ఏదైనా చివరి నిమిషం మార్పు ఉంటే నెక్స్ట్ వీక్ కి వాయిదా పడొచ్చు. నా సామిరంగ ని ఫిబ్రవరి 15 హాట్ స్టార్. లో మనం చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ.. ఈ చిత్రం థియేటర్ రన్ ముగింపులో ఉంది కాబట్టి ఈ సినిమా క్రేజ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంలో హాట్ స్టార్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
కాగా మహేష్ బాబు సినిమా గుంటూరు కారం ని ఫిబ్రవరి 9 నుంచే నెట్ ఫ్లిక్స్ లో ప్రచారం చెయ్యొచ్చు అని వార్త వినిపిస్తోంది. ఒకవేళ ఇది మిస్సయింది అంటే నలభై అయిదు రోజుల గ్యాప్ రెండో ఆప్షన్. అయితే ఈ చిత్రానికి ఇచ్చిన రేట్ కి మొదటిదే జరిగే అవకాశం ఉంది.
ఇక సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హనుమాన్’ని జీ5 సంస్థ మార్చి మూడో వారంకి షిఫ్ట్ చేసిందట.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే ఈ సినిమా ఫిబ్రవరిలోనూ ఓటీటీలోకి రావాలి కానీ చిత్రం ఇంకా కూడా థియేటర్లో బాగా ఆడుతుండగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ మార్చ్ 2 లేదా మూడో వారాలకు షిఫ్ట్ అయిపోయింది.
Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి