New Changes from 1 February 2024: రేపట్నించి ఐఎంపీఎస్, ఎన్‌పీఎస్, గ్యాస్ ధరల్లో మార్పులు

ఫిబ్రవరి 1 అంటే రేపట్నించి నిత్య జీవితంలో ఉపయోగపడే చాలా అంశాలు మారిపోతున్నాయి. కొన్ని అంశాల్లో నిబంధనలు మారుతున్నాయి.. ఎన్‌పీఎస్, ఐఎంపీఎస్ నిబంధలు, ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ ఇలా అన్నీ మారిపోనున్నాయి.  గ్యాస్ సిలెండర్ ధరలు కూడా మారుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

New Changes from 1 February 2024: ఫిబ్రవరి 1 అంటే రేపట్నించి నిత్య జీవితంలో ఉపయోగపడే చాలా అంశాలు మారిపోతున్నాయి. కొన్ని అంశాల్లో నిబంధనలు మారుతున్నాయి.. ఎన్‌పీఎస్, ఐఎంపీఎస్ నిబంధలు, ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ ఇలా అన్నీ మారిపోనున్నాయి.  గ్యాస్ సిలెండర్ ధరలు కూడా మారుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
 

1 /6

ఎస్బీఐ హోమ్ లోన్  ఎస్బీఐ హోమ్ లోన్ క్యాంపెయిన్ నడుస్తోంది. ఇందులో భాగంగా తక్కువ వడ్డీకే హోమ్ లోన్ లభిస్తుంది. 65 బేసిస్ పాయంట్లు తగ్గింపు ఇస్తోంది ఎస్బీఐ. 

2 /6

పంజాబ్ సింధ్ బ్యాంక్ ఎఫ్‌డి పంజాబ్ సింధ్ బ్యాంక్ తన కస్టమర్లకు ధనలక్ష్మి 444 డేస్ పేరుతో ఎఫ్‌డి పధకం అందిస్తోంది. ఈ పధకం రేపట్నించి అందుబాటులో ఉండదు.  ఈ ఎఫ్‌డి పరిధి 444 రోజులుంటుంది. ఇందులో సాధారణ పౌరులకు 7.4 వడ్డీ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు 7.9 శాతం వడ్డీ ఉంటుంది. 

3 /6

ఎన్‌పీఎస్ నియమాలు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ఫిబ్రవరి 1 నుంచి మార్పు రానుంది. ఎన్‌పీఎస్ ఎక్కౌంట్ నియమాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. కొత్త నియమాల ప్రకారం మొత్తం జమ చేసిన డబ్బుల్లో 25 శాతం కంటే ఎక్కువ తీసుకునేందుకు అనుమతి లేదు. 

4 /6

ఐఎంపీఎస్ నియమాలు ఫిబ్రవరి 1 మనుంచి ఐఎంపీఎస్ నియమాల్లో కీలక మార్పు రానుంది. రేపట్నించి లబ్దిదారుడి పేరు చేర్చకుండానే బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి మరో బ్యాంక్ ఎక్కౌంట్‌కు 5 లక్షల వరకూ డబ్బులు బదిలీ చేయవచ్చు. దీనికి సంబంధించిన సర్క్యులర్ అక్టోబర్ 31నే జారీ అయింది. 

5 /6

గ్యాస్ సిలెండర్ ధరలు ప్రతి నెలా ఒకటవ తేదీకు ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలెంజర్ ధరల్ని సమీక్షిస్తుంటుంది. ఫిబ్రవరి 1న గ్యాస్ సిలెండర్ ధరలు మార్పు రావచ్చు. 

6 /6

ఫాస్టాగ్ కేవైసీ మీరు ఫాస్టాగ్ వినియోగిస్తుంటే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చివరి తేదీ జనవరి 31 అంటే ఇవాళే ఆఖరు తేదీ.