Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తోంది. హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. ఇక పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ చందమామ ఇపుడు వరుస సినిమాలతో కుమ్మేస్తోంది.
తెలుగు తెర చందమామ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.
తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో పాపులర్ అయింది. మగధీరతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.
పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.
పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ భామ.. ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
రీసెంట్గా 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.