Valentine day 2024 - Divorce Couple: సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో చాలా మంది జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసుంటున్నారు. కొంత మంది జీవితాలు నీటి మీద రాతలే. పెళ్లిళ్లు ఎంత వేగంగా చేసుకుంటారో.. అదే స్పీడులో విడాకలు తీసుకుంటున్నారు. మొత్తంగా విడాకులు తీసుకున్న ఫిల్మ్ పర్సనాలిటీస్ ఎవరెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
నాగ చైతన్య - సమంత: టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీళ్లిద్దరు ఎంతో వేగంగా పెళ్లి చేసుకున్నారో.. మనస్పర్ధల కారణంగా విడిపోయారు.
నాగార్జున - లక్ష్మి: నాగ చైతన్య, సమంత బాటలో.. చైతూ తల్లిదండ్రైలన నాగార్జున, లక్ష్మిలు కూడా పరస్పర అంగీకారంతో విడిపోయారు.
సుమంత్ - కీర్తి రెడ్డి: సుమంత్, కీర్తి రెడ్డిలు పెళ్లైన కొన్ని రోజులు తర్వాత వీరు విడిపోయారు.
నిహారిక - చైతన్య జొన్నలగడ్డ: మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డల పెళ్లి అప్పట్లో ఘనంగా జరిగింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏవో విభేదాల కారణంగా విడిపోయారు.
పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్: అటు కూతురు నిహారిక కంటే ముందు పవన్ కళ్యాణ్ విషయంలో మూడు పెళ్లిళ్లు ఎపుడు చర్చకు వస్తుంటాయి. అందులో మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు.
కమల్ హాసన్: కమల్ హాసన్ కూడా పవన్ కళ్యాణ్ కంటే ముందు తన ఇద్దరు భార్యలైన వాణీ గణపతి, సారికకు విడాకలు ఇచ్చారు.
నరేష్ - పవిత్రా లోకేష్: నరేష్ ఇప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చారు. అటు పవిత్ర లోకేష్ కూడా తన మాజీ భర్తలకు విడాకులు ఇచ్చింది. వీళ్లిద్దరు ప్రస్తుతం లివింగ్ రిలేషన్లో ఉన్నారు.
మంచు మనోజ్ : మంచు మనోజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఏదో తెలియని కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత రెండో వివాహాం చేసుకున్నారు.
సౌందర్య రజినీకాంత్ : సౌందర్య రజినీకాంత కూడా మొదటి భర్తతో విభేదాల తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. విడాకుల తీసుకున్న సెలబ్రిటీలు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.