Ayodhya Ram mandir Darshan: అయోధ్య ప్రారంభించిన సమయం నుంచి బాలరాముని దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు బాలరాముని దర్శనం కోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యకు వచ్చే భక్తులు సులభంగా దర్శనం పొందేలా కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. ఈనేపథ్యంలో దర్శనానికి రోజువారీ వ్యవధిని 6 షిఫ్టులుగా విభజించారు. అంతేకాదు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పాస్‌లు కూడా జారీ చేస్తున్నారు.
సులభమైన దర్శనం కోసం పాస్..
భక్తులకు సాధారణ దర్శనంతోపాటు ప్రత్యేక, సులభమైన దర్శన పాస్‌లను జారీ చేయాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది. ప్రతి షిఫ్ట్‌లో నిర్దిష్ట దర్శనానికి 100 పాస్‌లు , ఈ విధంగా రోజుకు 600 ప్రత్యేక పాస్‌లు జారీ చేయనున్నారు. ఈ పాస్‌లను ట్రస్ట్, జిల్లా పరిపాలన, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడీషియల్ ఆఫీసర్, ఎస్పీ సెక్యూరిటీ, ట్రస్ట్‌తో అనుబంధించబడిన బాధ్యతగల వ్యక్తుల ఆమోదంతో చేయవచ్చు. ప్రస్తుతం, ఈ పాస్‌లను కౌంటర్ నుండి మాత్రమే పొందవచ్చు, అయితే సాఫ్ట్వేర్ సిద్ధమైన తర్వాత పాస్‌లను ఆన్లైన్లో కూడా పొందవచ్చు.
ఇదీ చదవండి: నేటి నుంచి ఆన్లైన్లో మేడారం ప్రసాదం బుకింగ్ సేవలు..
సులభమైన దర్శనం కోసం ట్రస్ట్‌తో అనుబంధించబడిన ఏ వ్యక్తి ఆమోదంతోనైనా పాస్‌లు చేయవచ్చు. ఇందుకోసం ఒక్కో షిఫ్ట్‌లో గరిష్టంగా 300 పాస్‌లు జారీ చేయబడతాయి. ఈ పాస్ ఉన్న భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక మార్గం చేసే ఆలోచన కూడా జరుగుతోంది. దీనికి తక్కువ సమయం పడుతుంది, దర్శనం సులభంగా చేయవచ్చు.
ఇదీ చదవండి: ముస్లిం దేశమైన యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా?
బాలరాముని దర్శనానికి 6 షిఫ్టులు..
మొదటి షిఫ్ట్ - 7AM నుండి 9AM
2వ షిఫ్ట్ - 9AM నుండి 11AM
3వ షిఫ్ట్ - 1PM నుండి 3PM
4వ షిఫ్ట్ - 3PM నుండి 5PM
5వ షిఫ్టు - 5PM నుండి 7PM
6వ షిఫ్ట్ - 7PM నుండి 9PM (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook