Nail Care Tips: గోర్లు చేతి వేళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. అందుకే అమ్మాయిలకు వీటిపై మక్కువ ఉంటుంది. గోర్లను అందంగా ఉంచేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందమైన నెయిల్ ఆర్ట్‌తో సింగారిస్తుంటారు. గోర్లను అందంగా మలిచేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నెయిల్ మాలిష్ గోర్లను రోజూ మాలిష్ చేయడం చాలా మంచి పద్ధతి. దీనివల్ల గోర్ల చుట్టూ ఉండే మలినాలు, వ్యర్ధాలు తొలగిపోవడమే కాకుండా డెడ్ స్కిన్ పోతుంది. గోర్లు మరింత అందంగా మారతాయి. ఆరెంజ్ జ్యూస్ గోర్లను అందంగా చేస్తాయి.
పాలు పాలు శరీరానికి సూపర్ ఫుడ్‌లా పనిచేస్తాయి. గోర్ల పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి. పాలను కాటన్ సహాయంతో రోజూ గోర్లకు అప్లై చేయాలి. దీనివల్ల గోర్లు నిగనిగలాడతాయి. మరింత అందంగా కన్పించేందుకు నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు.
వెల్లుల్లి వెల్లుల్లి గోర్లను అందంగా, ఆకర్షణీయంగా మల్చడంలో ఉపయోగపడతాయి. గోర్ల పెరుగుదలలో కూడా వెల్లుల్లి అద్భుతంగా దోహదపడుతుంది. వెల్లుల్లి రసాన్ని కాటన్ సహాయంతో గోర్లకు అప్లై చేయాలి.
కొబ్బరి నూనె కొబ్బరి నూనె కేవలం కేశాలకే కాదు గోర్లకు కూడా మంచి రక్షణ ఇస్తుంది. గోర్లు పెరగడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. కొబ్బరి నూనెతో గోర్లు మాలిష్ చేయడం ద్వారా గోర్లకు నిగారింపు వస్తుంది.
నిమ్మరసం గోర్లపై అందమైన ఆర్ట్ వేసి మరింత అందంగ మలిచేందుకు అమ్మాయిలు ప్రయత్నిస్తుంటారు. గోర్లను అందంగా మలిచేందుకు నిమ్మరసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని గోర్లపై రుద్దడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి. గోర్లలో ఉండే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ దూరమౌతుంది.