Pineapple Benefits: పైనాపిల్ అనేది సీజనల్ ఫ్రూట్. బయట్నించి గట్టిగా ముళ్లతో నిండి ఉన్నా లోపల మాత్రం రసంతో కూడి తీపిగా ఉంటుుంది. పైనాపిల్ ఫ్లేవర్ చాలా ప్రత్యేకంగా ఉండటం వల్ల అందరూ చాలా ఇష్టంగా తింటారు. పైనాపిల్‌లో పోషక విలువలు చాలా చాలా ఎక్కువ.
పైనాపిల్ అంటే విటమిన్లు, ఖనిజాలకు ప్రసిద్ధి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో ఉండే ఎంజైమ్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యను ఇట్టే తగ్గిస్తుంది. పైనాపిల్ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
పైనాపిల్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. చర్మంపై ఉండే మచ్చలు, మరకలు తొలగిపోతాయి. స్కిన్ కేర్ కోసం పైనాపిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పైనాపిల్ అంటేనే విటమిన్ సికు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఫలితంగా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడటంలో పైనాపిల్ కీలకపాత్ర పోషిస్తుంది. పైనాపిల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పైనాపిల్‌లో ఉండే ఫైబర్, విటమిన్ సి కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. అధిక రక్తపోటు సమస్య దూరమౌతుంది. అంటే రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మాత్రం పైనాపిల్‌కు దూరంగా ఉండాలంటారు వైద్యులు. ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ చాలా అధికం.
Also read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook