Natural Mosquitoe Repllents: సాధారణంగా అందరూ కేవలం చలికాలంలోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ, అది తప్పు. దోమలు అన్నీ సీజన్లలో కనిపిస్తున్నాయి. అవి మనపై దాడిచేస్తాయి. ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, ఇళ్లలో దోమల బెడద మరింత పెరుగుతుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మనల్ని కుడతాయి. దీంతో ప్రాణాంతక డెంగీ, మలేరియా కూడా వస్తాయి.
కొన్ని ఇంటి చిట్కాలతో దోమలను మన ఇంటి పరిసర ప్రాంతాలనుంచి దూరంగా తరమొచ్చు అవేంటో తెలుసుకుందాం.
దోమలను తరమడానికి కావాల్సిన పదార్థాలు.. నిమ్మకాయ, లవంగాలు, వత్తి, కర్పూరం, ఆవనూనె
ఇప్పుడు నిమ్మకాయను తలభాగం కాస్త కట్ చేయాలి. ఆ తర్వాత స్పూన్‌తో అందులోని నిమ్మకాయ గుజ్జును తీసివేయాలి.
ఆ తర్వాత ఖాళీ నిమ్మడొప్పలో ఆవనూనె పోయాలి. అందులోనే కొన్ని లవంగాలు, కర్పూరం కూడా నలిమి వేయాలి.
ఇప్పుడ దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత గదితలుపులు మూసివేయండి. దీంతో తలుపు సందుల్లో ఉన్న దోమలు సైతం పరారవుతాయి.