India vs England 5th Test Day 01 Highlights: ధర్మశాల టెస్టులో టీమిండియా స్పిన్నర్లు ఇంగ్లండ్ ను వణికించారు. కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav), రవిచంద్రన్ అశ్విన్(R Ashwin)లు ధాటికి స్టోక్స్ సేన 218 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఆటగాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలే(79 ) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా మణికట్టు బౌలర్ కుల్దీప్ ఐదు వికెట్లు తీయగా.. కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. మరోవైపు టీమిండియా దూకుడుగా ఫస్ట్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 30 ఓవర్లలో వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. రోహిత్(52), గిల్ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి 57(5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. భారత్ ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు క్రాలే, డకెట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే క్రాలే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ జట్టు 64 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. 27 పరుగులు చేసిన డకెట్ ను కుల్దీప్ తీశాడు. లంచ్ కు ముందే ఓలీ పోప్ ను ఔట్ చేసి మళ్లీ బ్రేక్ ఇచ్చాడు కుల్దీప్. కాసేపటికే క్రాలే కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోరూట్, బెయిర్ స్టో నిలకడగా ఆడారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మళ్లీ కుల్దీప్ విడదీశాడు. బెయిర్ స్టోను ఔట్ చేసి ఇంగ్లండ్ ను మళ్లీ దెబ్బతీశాడు. కెప్టెన్ స్టోక్స్ కూడా అదే ఓవర్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. టెయిలెండర్ల వికెట్లను అశ్విన్ తీశాడు. బెన్ ఫోక్స్(24) కాసేపు ప్రతిఘటించినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయాడు.
Also Read: IND Vs ENG: 23 ఏళ్ళ రికార్డు సమం చేసిన జాక్ క్రాలే.. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook