Dubai Mall: దుబాయ్ అంటే ప్రసిద్ధి చెందిన కట్టడాలకు పేరు. ప్రపంచంలో అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఉన్న దుబాయ్ మాల్ కొత్త చరిత్రను సృష్టించింది. 2023లో ఈ మాల్‌ను పదిన్నర కోట్లమంది సందర్శించారు. ప్రతియేటా సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.
దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ అనేది దుబాయ్ మాల్ లో ప్రత్యేక ఆకర్షణ. మెరైన్ జీవితాన్ని అత్యంత సమీపం నుంచి అనుభూతి పొందవచ్చు. 140కుపైగా జంతుజీవాలను చూడవచ్చు.
దుబాయ్ మాల్ అనే కంటే ప్యాలెస్ అనడం మంచిది. ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి బెస్ట్ ప్లేస్ ఇది. చాలమందికి ఇక్కడికి సందర్శన కోసమే వస్తుంటారు.
తిండిప్రియులకు దుబాయ్ మాల్ చాలా ప్రసిద్ధి. ఇండియన్స్, అమెరికన్స్, బ్రిటీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, మిడిల్ ఈస్టర్న్, చైనీస్ ఇలా ప్రతి దేశపు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి.
విచ్చలవిడిగా, స్వేఛ్ఛగా ఖర్చుపెట్టేవారికి దుబాయ్ మాల్ చాలా ఫేమస్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఫ్రాగ్నెన్స్, హోమ్ డెకోర్, లగ్జరీ వస్తువులు లెక్కలేనన్ని ఉంటాయి.
దుబాయ్ మాల్ 2008లో ప్రారంభమైంది. విస్తీర్ణం ప్రకారం చూస్తే ప్రపంచంలో రెండవ అతిపెద్ద మాల్ ఇది. ఇందులో 1200 కు పైగా రిటైల్ స్టోర్స్ ఉన్నాయి.