Falguni amavasya 2024: పాల్గూని అమావాస్య ఈసారి ఆదివారం వచ్చింది. కొందరికి ఎంత సంపాదించిన కూడా డబ్బులు అస్సలు నిలువవు. నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు ఈరోజు ఈ పరిహారాలు చేస్తే జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సాధారణంగా మనలో చాలా మంది అమావాస్య తిథి మంచిది కాదని భావిస్తారు. మన పూర్వకాలంలో కూడా అమావాస్యకు ముందు ఆ తర్వాత ఏ పనులు కూడా ముట్టుకోరు. ఈరోజున ఈ పనిప్రారంభించిన కూడా మూలకు పొతుందని, సక్సెస్ కాదని భావిస్తారు. పెళ్లిళ్ల సమయంలో లేదా ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటివి ఎక్కువగా పాటిస్తారు.
అమావాస్యను రోజున కొందరు మాత్రం పనులు స్టార్ట్ చేస్తారు. ఈరోజున కొన్నిపరిహారాలు చేస్తే జీవితాంతం కలిసి వస్తుందని నమ్ముతారు. దీపావళిపండగను మనం అమావాస్య రోజు జరుపుకుంటాం. చెడుపై మంచి సాధించిన గెలుపుకు గుర్తుగా దీన్ని జరుపుకుంటాం.
ఈరోజున ముఖ్యంగా చనిపోయిన మన పూర్వీకులకు శ్రాద్ధకర్మాదులు చేయాలని చెబుతుంటారు. ఇలా చేస్తే వారు ఏదైన తీరని కోరికలతో చనిపోయినట్లైతే శాంతిస్తారంట. మనంలో కొందరు పెళ్లికుదరక, ఉద్యోగాలలో స్థిరత్వం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు ఈరోజు పెద్దలకు పేరు మీద దానధర్మాలు చేయాలి..
ముఖ్యంగా అమావాస్య, ఆదివారం రెండు కలిసి రావడం ను ఎంతో విశేషంగా పండితులు భావిస్తారు. ఈ రోజు సూర్యరాధన చేయడం వల్ల జీవితంలో మంచి జరుగుతుందంట. ఆదివారం రోజు తలకు నూనె పెట్టుకొవడం, కటింగ్, షెవింగ్ లాంటివి అస్సలుచేసుకోకుడదంట..
అమావాస్య, ఆదివారం వచ్చిన ఈరోజు గంగా స్నానం చేయాలి. ఇంట్లో పూజ చేశాక.. సాంబ్రాణి ధూపం వెలిగించి, దాన్ని ఇల్లంతా ప్రతిగదిలో పొగ వెళ్లేలా చేయాలి. దీంతో ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మన లాకర్ లో గంధపు చెక్క, పూజ చేసిన పసుపు కొమ్మును ఒక పసుపు క్లాత్ తో చుట్టిపెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో డబ్బే డబ్బు.. అస్సలు ఖర్చవదు.
అమావాస్య రోజున పేదలకు స్వీట్లు పంచిపెట్టాలి. ఈరోజున అన్నదానం, రోడ్డుపైన ఉన్న వారికి చేతనైన వస్త్రదానం, చెప్పులు కొనివ్వడం, తాగునీటి సదుపాయం కల్పించడం లాంటివి చేస్తే జీవితంలో కొన్ని రోజులకే ఊహించని మంచి మార్పులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)