దీపావళి సందర్భంగా జియో టెలికాం సంస్థ సరికొత్త ఆఫర్‌తో వచ్చింది. 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.149 కంటే ఎక్కువ ప్రీ పెయిడ్ రీఛార్జీలపై ఈ క్యాష్ బ్యాక్ వర్తింపజేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. నవంబరు 30వ తేది వరకే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపారు. జియో ఓల్డ్, న్యూ కస్టమర్స్‌తో పాటు జియో ప్రైమ్ యూజర్లు అందరూ కూడా ఈ ఆఫర్‌కు అర్హులే. రూ.149 నుండి రూ.9999 వరకు ఎంత మొత్తం రీఛార్జీ చేయించుకున్న సరే.. క్యాష్ బ్యాక్ ఇస్తామని పేర్కొన్నారు. అయితే ఈ క్యాష్ బ్యాక్ మొత్తాన్ని రిలయెన్స్ వారు డిజిటల్ కూపన్ల రూపంలో ఇస్తారట. రూ.509 వరకు రీఛార్జీపై ఒక కూపన్‌ను అందిస్తున్నారు.
రిలయెన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్లలో ఈ కూపన్స్ ఇచ్చి వస్తువులను కొని విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే మినిమమ్ కార్ట్ విలువ రూ.5000 ఉంటేనే ఆ మొత్తాన్ని ఎన్ క్యాష్ చేసుకోవడం సాధ్యపడుతుంది. ఈ క్యాష్ బ్యాక్ కూపన్లు డిసెంబరు 31, 2018 వరకు మాత్రమే చెల్లుతాయని జియో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే జియో కొత్త టారిఫ్ ప్లాన్‌తో వచ్చింది. రూ.1699 టారిఫ్‌తో సంవత్సర కాలం పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ఇస్తున్నట్లు తెలిపింది. రోజువారీ 1.5 జీబీ ఇస్తూ.. మొత్తం ప్లాన్ ప్రకారం 547 జీబీ అందివ్వడం ఈ పథకంలో విశేషం. అన్ లిమిటెడ్ టెక్స్ట్ మెసేజ్స్తో పాటు జియో అప్లికేషన్ బోకెట్కి ఈ ప్లాన్‌లో భాగంగా.. కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. గత నెల జియో ప్రారంభించిన సెలబ్రేషన్ ఆఫర్ ప్రకారం ఇప్పటికే వినియోగదారులకు 8 జీబీ 4జీ డేటా అదనంగా ఇస్తున్నామని జియో సంస్థ తెలిపింది.