NDA Alliance: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమిలో సీట్లు సంఖ్యపై క్లారిటీ ఉన్నా ఏయే స్థానాలనే విషయంలోనే సందిగ్దత నెలకొంటోంది. తెలుగుదేశం దాదాపుగా 5-6 స్థానాలు మినహా అన్నీ ప్రకటించింది. జనసేన కూడా ఇంకా కొన్ని పెండింగులో పెట్టింది. బీజేపీ ఇంకా అధికారికంగా ఏ స్థానాన్ని ప్రకటించలేదు. స్థానాల కేటాయింపులో బీజేపీలో అసంతృప్తి రేగుతోంది.
జనసేన పార్టీ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి గన్నవరం నుచి గిడ్డి సత్యనారాయణలకు సీట్లు ఖరారయ్యాయి. అంతకుముందు నిడదవోలు కందులు దుర్గేష్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల నుంచి మాధవి, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల పేర్లు ఖరారయ్యాయి. ఇక పోలవరం నుంచి చిర్రి బాలరాజు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, నర్శాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శీనివాస్, తిరుపతి నుంచి అరణి శ్రీనివాసులు స్థానాలు ఖరారయ్యాయి.
ప్రస్తుతం తెలుగుదేశం నుంచి ఇంకా 7 స్థానాలకు క్లారిటీ రావల్సి ఉంది. బీజేపీ మొత్తం 10 స్థానాలు ఇంకా ప్రకటించలేదు. జనసేన నుంచి ఇంకా 3 స్థానాలకు అభ్యర్ధులు ఎవరో తేలాల్సి ఉంది. బీజేపీ నుంచి ఎచ్చెర్ల, అనపర్తి, విజయవాడ పశ్చిమం, బద్వేల్ , ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, విశాఖ నార్త్ స్థానాలకు అభ్యర్ధులు తేలాల్సి ఉంది. జనసేన నుంచి పాలకొండ, రైల్వే కోడూరు, అవనిగడ్డ స్థానాలు ఖరారు కావల్సి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు పెండింగులో ఉన్నాయి.
బీజేపీకు విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం పార్లమెంట్ స్థానాలు ఖరారు కాగా బీజేపీ మార్పు కోరుతోంది. విజయనగరం స్థానంలో రాజంపేట లేదా అనంతపురం లోక్‌సభ కేటాయించాలని అడుగుతోంది.
Also read: AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షలు 2024 ఫలితాలు ఎప్పుడు విడుదలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook