Volunteer Resignations: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలకు సంక్షేమ పథకాల్ని ఇంటింటికీ చేర్చే వాలంటీర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నారు. వాలంటీర్లపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఎన్నికల సంఘం జారీ చేసిన కీలక ఆదేశాలు వాలంటీర్ల ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తున్నాయి.
ఏపీలో మొత్తం 2.67 లక్షలమంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారానే సమర్దవంతంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు ఇంటింటికీ ప్రతి నెలా 1వ తేదీన అందించగలుగుతోంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపధ్యంలో వాలంటీర్లను సంక్షేమ పధకాలకు దూరంగా ఉంచాలంటూ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సహా ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను సంక్షేమ పథకాలకు దూరంగా ఉంచడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన ఫోన్, ట్యాబ్ ఇతర పరికరాల్ని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో కన్పించే వాలంటీర్లను ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తోంది.ఇప్పుడు ఎన్నికల సమయంలో సంక్షేమ పధకాల అమల్లో దూరంగా ఉంచాలని ఆదేశించడంతో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాజీనామాల పర్వం కన్పిస్తోంది. రోజురోజుకూ రాజీనామా చేస్తున్న వాలంటీర్ల సంఖ్య పెరుగుతోంది. రాజీనామా చేసి నేరుగా వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది.
Also read: AP Summer Updates: పెరుగుతున్న ఎండలు, తీవ్రమైన వడగాల్పుల హెచ్చరిక జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook