Mangoes Soaked in Water: మామిడిపండ్లను తినబోయే ముందు నీళ్లలో ఎందుకు  నానబెట్టాలి?

Mangoes Soaked in Water: మామిడిపండ్లు అంటే ఇష్టం ఉండనివారు ఉండరు. ఎందుకంటే పండ్లలో రారాజు మామిడిపండే కాబట్టి. దీని రుచి తీయ్యగా అద్భుతంగా ఉంటుంది. మామిడిపండ్లను చూడగానే కొనుగోలు చేసి తినేయాలనిపిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 23, 2024, 10:00 AM IST
Mangoes Soaked in Water: మామిడిపండ్లను తినబోయే ముందు నీళ్లలో ఎందుకు  నానబెట్టాలి?

Mangoes Soaked in Water: మామిడిపండ్లు అంటే ఇష్టం ఉండనివారు ఉండరు. ఎందుకంటే పండ్లలో రారాజు మామిడిపండే కాబట్టి. దీని రుచి తీయ్యగా అద్భుతంగా ఉంటుంది. మామిడిపండ్లను చూడగానే కొనుగోలు చేసి తినేయాలనిపిస్తుంది. మన దేశంలో ఎన్నో రకాల మామిడిపండ్లు అందుబాటులో ఉన్నాయి. భంగినిపల్లి, అల్ఫోన్సా, తోతపరి వంటి రకరకాలు ఉన్నాయి. ఎండకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో మామిడిపండ్ల విక్రయాలు కూడా పెరిగిపోతాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్, స్మూథీలు కూడా తయారు చేసుకోవచ్చు. 

అయితే, ఆరోగ్యపరంగా కూడా మామిడిపండ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్క షుగర్ వ్యాధిగ్రస్థులు మినహాయించి మామిడిపండ్లును అందరూ తినవచ్చు. ముఖ్యంగా మామిడిపండ్లలో విటమిన్ ఏ, సీ వంటి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పనితీరుకు అత్యంత అవసరం. అంతేకాదు కంటి, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మామిడిపండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది. బరువు కూడా నిర్వహిస్తుంది. అయితే, మనం అమ్మమ్మకాలం నుంచి చూస్తాం. మామిడిపండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం. ఇలా ఎందుకు? అని ఎప్పుడైనా ఆలోచించారా?

మామిడిపండ్లలో బీటా కెరోటిన్, ఫ్లవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు పాడవ్వకుండా కాపాడతాయి. గుండె, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.  అంతేకాదు మామిడిపండ్లలో మెగ్నీషియం, విటమిన్ కే ఉంటుంది ఇది గుండె, ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఇదీ చదవండి: పుచ్చకాయతొక్కతో ఇలా బరువు తగ్గండి.. బీపీకి కూడా చెక్..

అయితే, తినే ముందు మామిడిపండ్లను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మామిడిపండు తొక్కపై ఫైటిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది మన శరీరాన్ని పండులోని జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు గ్రహించకుండా నివారిస్తుంది.  పండులోని ఆరోగ్య ప్రయోజనాలను పొందకుండా మామిడిపండు పై భాగంలో ఉండే యాక్టివ్ కంపౌండ్స్ నివారిస్తాయి. దీంతో పోషకాలు కూడా మనకు అందవు. అంతేకాదు ఇలా మామిడిపండ్లను నీళ్లలో నానబెట్టి శుభ్రంగా కడిగి తినకపోతే తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు. తినబోయే ముందు మామిడిపండ్లను నానబెట్టడం వల్ల ఫైటిక్‌ యాసిడ్‌ తొలగిపోతుంది. దీంతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

ఇదీ చదవండి: స్టార్‌ అనైజ్‌ తింటున్నారా? ఈ 7 ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లే..

మామిడిపండ్లను ఇలా నానబెట్టడం వల్ల పండుపై భాగం ఉన్న రసాయనాలు, మురికి పూర్తిగా తొలగిపోతుంది. మామిడిపండ్లు రవాణా అయినప్పుడు కాలుష్యం బారిన కూడా పడతాయి కాబట్టి వాటిని కడిగి తినాలి. ఇలా కాసేపు మామిడిపండ్లను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల దానిపై చర్మం సున్నితంగా మారుతుంది. సులభంగా కట్‌ చేయవచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News