Rain Fall In Tirumala: తిరుమలలో భక్తులకు భారీ ఊరట లభించింది. కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షంకురిసింది.
కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. సామాన్య జనాలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎండలు మాడు పగులు కొడుతున్నాయి. ఇప్పటికే ఎండలు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. అనేక చోట్ల ప్రజలు వడదెబ్బకు సైతం గురయ్యారు.
ఎండల వేడికి ప్రజలు బైటకు అడుగు వేయాలంటేనే భయపడిపోతున్నారు. అంతేకాకుండా.. అత్యవసరమైతేనే బైటకు వెళ్లాలని కూడా ప్రజలకు సూచనలు చేశారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు వడదెబ్బకు ఆరుగురు చనిపోయారు. ఏపీలో పెన్షన్ లు తీసుకొవడానికి వెళ్లి అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
ఇక సమ్మర్ సెలవుల నేపథ్యంలో చాలా మంది భక్తులు తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్తున్నారు. అంతేకాకుండా.. ఎండలో టీటీడీ సరైన సదుపాయాలుకల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తిరుమలలో భక్తులు ఒక చోట నుంచి మరోక చోటికి వెళ్లేందుకు కూడా కాళ్లు ఎండలో మాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈక్రమంలో శుక్రవారం రోజున తిరుమలలో అల్లాడిపోతున్న భక్తులకు, బిగ్ రిలిఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఇవాళ తిరుమల కొండపై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తిరుపతి, పలమనేరులోనూ మోస్తరు గా వర్షం కురిసింది.
ఇదిలా ఉండగా.. 3 రోజుల కిందట కూడా తిరుమలలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ నెల 6 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.