Worst Combination with Milk: ప్రతిరోజూ పాలు లేనిదే రోజు గడవదు. ఉదయం పాలు, కాఫీ, టీ పెట్టుకుని తాగుతాం. ఇది ఎంతో ఆరోగ్యకరం. అయితే, ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ ఉంటాయి.ఇది మన శరీర ఆరోగ్యకరమైన ఎంతో అవశ్యకం. పాలలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇతర పోతర పోషకాలు ఉంటాయి. ఇది గుండె, ఎముక ఆరోగ్యానికి సహాయపడుతుంది. కొంతమంది చాక్లొట్, అరటిపండు, ఇతర పండ్లతో పాలు తాగుతారు. అయితే, కొన్ని రకాల ఆహారాలతో పాలు తీసుకోకూడదు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
చేపలు..
పాలలో కూలింగ్ గుణాలు ఉంటాయి. అయితే, చేపల్లో వేడి లక్షణాలు కలిగి ఉంటాయి. పాలు, చేపలు కలిపి తీసుకుంటే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇది జీర్ణ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పాలు, చేపలు కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.
పుచ్చకాయ..
పుచ్చకాయలో దాదాపు 90 శాతం వరకు నీరు ఉంటుంది. పుచ్చకాయలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలలో డైరెటిక్ గుణాలు ఉంటాయి. పుచ్చకాయతో పాటు పాలను కూడా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా పుచ్చకాయ, పాలను కలిపి తీసుకోకూడదు.
పుల్లని ఆహారాలు..
అంతేకాదు చేపతో పాటు కొన్ని పుల్లని ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా యోగార్ట్, ఆరేంజ్, సిట్రిక్ యాసిడ్ పండ్లు వీటితోపాటు పాలు తీసుకుంటే గుండెలో మంటతోపాటు గ్యాస్, అజీర్తికి దారితీస్తుంది. పుల్లని ఆహారాలతోపాటు పాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తప్పవు. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
ఇదీ చదవండి: కాఫీకి బదులుగా ఈ 5 డ్రింక్స్ తీసుకోండి.. డబుల్ హెల్త్ బెనిఫిట్స్..
అరటిపండు..
సాధారణంగా పాలు, అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ, నిజానికి అరటిపండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే పాలు, అరటిపండు రెండిటినీ కలిపి తీసుకోకూడదు. లేకపోతే దీంతో వెర్టిగో, జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది.
ఇదీ చదవండి: వాల్‌నట్స్ ప్రతిరోజూ ఖాళీ కడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
ర్యాడిష్..
పాలతో పాటు తినకూడని మరో ఆహారం ర్యాడిష్. ఇది కూడా బ్యాడ్ కాంబినేషన్. ఎందుకంటే రెండిటిలో వేడి చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే, ఎట్టిపరిస్థితుల్లో ర్యాడిష్, పాలు కలిపి తీసుకోకూడదు.ఇది మీ కడుపులో చేరి వేడిని పుట్టిస్తాయి. అంతేకాదు ఇతర కడుపు సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Worst Combination with Milk: పాలతో పాటు ఈ ఫుడ్స్ తినకూడదు.. అవి ఏంటో తెలుసా?