Almond Oil Benefits: రోజూరాత్రి పడుకునేముందు ఈ ఒక్క ఆయిల్‌తో మీ ముఖం మసాజ్ చేయండి.. హిరోయిన్ వంటి అందం మీదే..

Almond Oil Benefits: మనం అందంగా కనిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తాం. అయినా కానీ, సరైన ఫలితాలు లభించవు. అయితే, బాదం ఆయిల్‌తో ప్రతిరోజూ రాత్రి మీ ముఖానికి అప్లై చేసి చూడండి హిరోయిన్ వంటి అందం మీ సొంతం

Written by - Renuka Godugu | Last Updated : May 15, 2024, 01:45 PM IST
Almond Oil Benefits: రోజూరాత్రి పడుకునేముందు ఈ ఒక్క ఆయిల్‌తో మీ ముఖం మసాజ్ చేయండి.. హిరోయిన్ వంటి అందం మీదే..

Almond Oil Benefits: మనం అందంగా కనిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తాం. అయినా కానీ, సరైన ఫలితాలు లభించవు. అయితే, బాదం ఆయిల్‌తో ప్రతిరోజూ రాత్రి మీ ముఖానికి అప్లై చేసి చూడండి హిరోయిన్ వంటి అందం మీ సొంతం అవుతుంది. దీంతో కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.రోజూ రాత్రి పడుకునే ముందు ఓ 5 నిమిషాలపాటు బాదం నూనెను ముఖానికి మసాజ్ చేయాలలి. బాదం నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ముఖానికి సహజంగా మాయిశ్చర్‌ను నిలుపుతాయి. ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తగ్గించేస్తాయి. ముఖంపై గ్లో పెరుగుతుంది. మీ ముఖం మృదువుగా మారుతుంది.బాదం నూనెతో తరచూ ముఖానికి మసాజ్ చేయడం వల్ల మీ ముఖంపై ఉండే మచ్చలు, గీతలు కూడా తగ్గిపోతాయి. బాదం నూనెతో కలిగి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

యాక్నే..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బాదం నూనె ముఖానికి రాయడం వల్ల ముఖంపై ఉండే సెబం ఉత్పత్తిని తగ్గిస్తుంది. మంచి స్కిన్‌ టోన్ కు ప్రేరేపిస్తుంది.మీ ముఖంపై ఉండే యాక్నేకు చెక్ పెడుతుంది.

మెరిసే ముఖం..
బాదం నూనె వల్ల మీ ముఖానికి సహజసిద్ధమైన గ్లో వస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ మీ ముఖాన్ని మెరిపిస్తుంది.  మీ ముఖానికి పునరుజ్జీవనాన్ని అందిస్తుంది. అంతేకాదు మీ ముఖం పట్టులా మెరిసిపోతుంది.

సన్‌బర్న్..
ఎండకాలం సన్‌ బర్న్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది.బాదం నూనె రాత్రి పడుకునేటప్పుడు రాయడం వల్ల సన్‌ బర్న్‌ సమస్య కూడా తగ్గిపోతుంది.  సూర్యుడి హానికర కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షిస్తుంది. 

ఇదీ చదవండి: రోజ్‌ వాటర్‌ మీ ముఖానికి అప్లై చేస్తే మచ్చలేని చందమామలా మెరిసిపోతారు..

ఇందులో ఉండే ఓలియక్, లైనోలిక్‌ యాసిడ్స్‌ బాదంలో ఉంటాయి. ఇది నేచురల్‌ మాయిశ్చర్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై దురద రాకుండా నివారిస్తుంది. బాదం స్కార్స్, స్ట్రెచ్ మార్క్స్‌ తొలగిస్తుంది. బాదం నూనె మన ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.

ఇదీ చదవండి: అరటి పండుతో ఆరోగ్యం.. ఇలా తింటే 6 అద్భుతమైన బెనిఫిట్స్..

ఇదేకాదు బాదం ఆయిల్ ఉపయోగించి మన ముఖం ఉన్న మేకప్‌ను కూడా తొలగించుకోవచ్చు. బాదం ఆయిల్‌లో సహజసిద్ధంగా నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఎండకాలం ప్రతిరోజూ రాత్రి ముఖానికి బాదం నూనె రాసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News