అగ్రవర్ణాల రిజర్వేషన్లను వ్యతిరేకించడానికి కారణం చెప్పిన ఓవైసీ

జనరల్ కేటరిగి రిజర్వేషన్ల బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరో సారి స్పందించారు

Last Updated : Jan 10, 2019, 08:15 PM IST
అగ్రవర్ణాల రిజర్వేషన్లను వ్యతిరేకించడానికి కారణం చెప్పిన ఓవైసీ

అగ్రవర్ణాల రిజర్వేషన్ల నిర్ణయాన్ని తప్పుబట్టిన ఓవైసీ..మరోమారు ఈ అంశం స్పందించారు. ప్రముఖ టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఓవైసీ...తాను ఈబీసీ రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేస్తున్నదో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాల తరబడిని అణగదొక్కడబడిన వర్గాల కోసం మాత్రమే రాజ్యంగ నిర్మాతలు రిజర్వేషన్లు కల్పించారు.వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. రిజర్వేషన్ల ద్వారా దీంతో వారు సామాజికంగా సమాన హోదా సాధించే అవకాశం కల్పించారు. రిజర్వేషనకలు సంబంధించి ఆర్టికల్ 15, 16లో చాలా స్పష్టంగా ఉన్నాయి. రిజర్వేషన్ల పొందే హక్కు కేవలం అగణారిన వర్గాలకు మాత్రమే ఉంది. 

ఇది రాజ్యంగ స్పూర్తికి విరుద్ధం\

 అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఆర్ధిక అంశాల ఆధారంగా రిజర్వేషన్ల ఇవ్వాలని రాజ్యాంగలో ఎక్కడా లేదు..అయినప్పటికీ దీని ఆధారంగా మోడీ సర్కార్ రిజర్వేషన్లు కల్పించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.ఆర్ధిక అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడమనేది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. మోడీ సర్కార్ తీరు రాజ్యాంగాన్ని విలువలను.. అంబేద్కర్ సిద్ధంతాలను అవమానించేలా ఉంది.  ఆర్ధిక అంశాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని గతంలో సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పు ఆధారం చేసుకొని ఆర్ధిక అంశాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని తాను వాదిస్తున్నాని పేర్కొన్నారు

ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇస్తారు..

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మోడీ సర్కార్ చెబుతోంది. ఆయా వర్గాల వారు ఆర్ధికంగా వెనకబడినట్లు ఏమైన గణంకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. వెనుకబాటుకు ఎలాంటి గుణాంకాలు లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తాననడం ఎంత వరకు సమంజసమని ప్రశించారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఎంతో మంది అగ్రవర్ణాల వారే ఉన్నారు. అగణారిన వర్గాలకు మాత్రమే ప్రభుత్వాలు బాసటగా ఉండాలి కానీ..అగ్రవర్ణాలకు అండగా నిలవడం సమంజసం కాదని ఓవైసీ పేర్కొన్నారు

Trending News