Facemasks: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం సంగతేమో గానీ అందంపై మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ఎండలు, వేడిమి కారణంగా ముఖంపై మచ్చలు, మరకలు, ట్యానింగ్తో అందం దెబ్బతింటుంది. అందుకే వేసవిలో ఈ 5 రకాల హోమ్ మేడ్ మాస్క్ ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయి. చర్మం నిగనిగలాడుతుంటుంది.
కీరా ఫేస్మాస్క్ కీరా ఫేస్మాస్క్ రాయడం వల్ల ముఖానికి ఫ్రెష్నెస్ వస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ కే, బీటా కెరోటిన్ కారణంగా చర్మం నిగనిగలాడుతుంది. కంటికి కూడా మంచిది.
శెనగపిండి ఫేస్మాస్క్ శెనగపిండి ఫేస్మాస్క్ ముఖంపై ఉండే మలినాలను శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా వాడుకలో ఉంది. రోజూ రాసినా ఏ సమస్య ఉండదు.
అల్లోవెరా ఫేస్మాస్క్ అల్లోవెరా ఫేస్మాస్క్ అనేది అత్యుత్తమమైంది. ఇది సూర్యుని కిరణాల్నించి మీ చర్మాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై చర్మాన్ని శుభ్రంగా ఉంచడంతో సహాయపడతాయి. చర్మాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది. పింపుల్స్, సన్బర్న్, ఎగ్జిమా వంటి సమస్యలు దూరమౌతాయి
కీరా-నిమ్మ ఫేస్మాస్క్ కీరా-నిమ్మరసం ఫేస్మాస్క్ రాయడం వల్ల ముఖంపై కొత్త నిగారింపు వస్తుంది. ముఖ చర్మం నిగనిగలాడుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మరకలు తొలగిపోతాయి. ఉదయం లేదా రాత్రి వేళ రాస్తే మంచిది.
పసుపు ఫేస్మాస్క్ వేసవిలో ముఖంపై మచ్చలు వంటి సమస్యలు తొలగించేందుకు పసుపుతో ఫేస్మాస్క్ అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి.