iOS 18 Features: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ ఇటీవల ఆపిల్ కంపెనీ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 మెగా ఈవెంట్ నిర్వహించింది. ఇందులో ఐఫోన్స్ కోసం ఐవోఎస్ 18 వెర్షన్ లాంచ్ చేసింది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం ద్వారా యూజర్లకు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
సఫారీ ఇప్పుడు వెబ్పేజిపై కీలకమైన సమాచారం అందించగలదు. రీడర్ మోడ్ కూడా కొత్త రూపంలో కన్పిస్తుంది.
ఐవోఎస్ 18 అప్డేట్లో టెక్స్ట్ తరువాత పంపించే విధంగా షెడ్యూల్ చేయవచ్చు. మెసేజ్‌కు రియాక్ట్ అవడంపై ఈమోజీ లేదా స్టిక్కర్ ఉపయోగించవచ్చు.మెస్సేజ్‌ను బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ లేదా స్ట్రైక్‌త్రూ ఫార్మట్‌లో పంపించవచ్చు.
ఐవోఎస్ 18లో ఫోటో యాప్‌లో కీలకమైన మార్పు చేశారు. కొత్త లే అవుట్ మీ లైబ్రరీ, గ్రిడ్‌ను ఒకే స్క్రీన్‌పై ఉంచుతుంది. ఇందులో ఫిల్టర్, టైమ్ స్కేల్ అనేవి ఫోటోలు సెర్చ్ చేసేందుకు ఉపయోగపడతాయి. స్క్రీన్ షాట్ , రిసీప్టులను ఫిల్టర్ చేస్తుంది.
లాక్ స్క్రీన్ ఇప్పటికే చాలవరకూ కస్టమైజ్ అయి ఉంది. ఇప్పుడు దీనిని మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాష్ లైట్, కెమేరా కంట్రోల్ మార్చవచ్చు.
ఐవోఎస్ 18లో కంట్రోల్ సెంటర్ విషయంలో కీలక మార్పు కన్పించనుంది. ఇందులో మ్యూజిక్, ఆప్స్ కోసం మరిన్ని కంట్రోల్స్ చేరాయి. బటన్ లే అవుట్ ఆకారాన్ని కూడా మార్చవచ్చు. కొత్త కంట్రోల్ సెంటర్లో చాలా పేజెస్ ఉన్నాయి. మీకిష్టమైనట్టు మార్చవచ్చు. దాంతోపాటు కొత్తగా కంట్రోల్ గ్యాలరీ ఉంటుంది. ఇందులో చాలా ఆప్షన్లు ఉంటాయి.