YS Jagan Mohan Reddy: ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో కుంగిపోయిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఎన్నికలపై వరుస సమీక్ష చేస్తున్న వైఎస్ జగన్ గురువారం ఎమ్మెల్సీలతో సమావేశమయయారు. అసెంబ్లీలో సంఖ్యా బలం 11 మాత్రమే ఉండడంతో అక్కడ పోరాటం చేసే శక్తి లేని పరిస్థితిలో శాసనమండలిపై జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.
Also Read: Amaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్.. ఊపిరి పోసుకున్న అమరావతి
'ఫలితాలు చూసి నిబ్బరం కోల్పోవద్దు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలో కాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశాం. రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం' అని జగన్ గుర్తు చేశారు. అన్నీ చేసి చూపించి ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కానీ ఎన్నికల్లో ఏమైందో తెలియదు' అని పేర్కొన్నారు.
Also Read: Nara Lokesh: 'అంతఃకరణ శుద్ధి' పలకలేని నారా లోకేశ్.. నిప్పు అనుకుంటే మళ్లీ పప్పేనా?
'సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా పైకి లేచామో అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఉంది. మనం చేసిన పాలన మీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం' అని జగన్ స్పష్టం చేశారు. 'దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి' అని భరోసా ఇచ్చారు.
'రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారం లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నది కూడా రాజకీయమే' అని జగన్ తెలిపారు. 'అసెంబ్లీలో సంఖ్యా బలం పెద్దగా లేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కానీ మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి' ఎమ్మెల్సీలకు హితబోధ చేశారు.
'మనల్ని ఎవరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏం చేయగలుగుతారు?' అని కక్ష రాజకీయాలపై జగన్ పేర్కొన్నారు. 'వారికి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు' అని అసహనం వ్యక్తం చేశారు. 'శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు మొదలయ్యాయి' అని తెలిపారు.
ప్రతిపక్ష హోదా ఇస్తారా?
'చంద్రబాబు రెండో పాపం కూడా అప్పుడే పండింది. ఎన్డీయేలో కీలకంగా ఉన్న సమయంలో కూడా ప్రత్యేక హోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోతే….. రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు' అని జగన్ తెలిపారు. 'చంద్రబాబు పాపాలన్నీ పండేదాకా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు' అని సూచించారు. అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే అని చెప్పారు. హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి సమయం ఇద్దామని తెలిపారు. భవిష్యత్‌లో ప్రజల్లోకి వెళ్దాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ ఉంది' అని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter