Sun Transit 2024: మిథున రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి జూలై వరకు లాభాలే లాభాలు!

Sun Transit 2024 In Telugu: సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 18, 2024, 01:37 PM IST
Sun Transit 2024: మిథున రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి జూలై వరకు లాభాలే లాభాలు!

Sun Transit 2024 In Telugu: సూర్యుడు ప్రతి నెలా రాశి సంచారం చేస్తూ ఉంటాడు. ఈ గ్రహం జూన్‌ నెలలో కూడా రాశి సంచారం చేసింది. జూన్‌ 15న సూర్యగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించింది. ఈ గ్రహం దాదాపు ఒక సంవత్సరం తర్వాత మిథున రాశిలోకి సంచారం చేసింది. ఈ రాశిలో సూర్యగ్రహం దాదాపు 1 నెల పాటు సంచారం దశలోనే ఉంటుంది. అయితే సూర్యుడు మిథున రాశిలోకి సంచారం చేయడం వల్ల శుభ, అశుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 3 రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే వృత్తి జీవితం గడుపుతున్నవారికి ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. దీంతో పాటు సానుకూల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తులారాశి:
తులారాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి పోటీ పరీక్షలు రాసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి విషయాల్లోనైనా తల్లిదండ్రలు నుంచి సపోర్ట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా సహకారం పొందుతారు. జీవితంలో ఏమి అనుకున్న ఆ పనులు సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు అద్భుతమైన లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి అదృష్టం పెరగడమే కాకుండా అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి మతపరమైన విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు కష్టపడి పని చేయడం వల్ల జీవితంలో ముందుకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే వీరికి సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు ఈ సమయంలో ఆశించని ఫలితాలు పొందుతారు. అలాగే నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాసేవారు కూడా విజయాలు సాధిస్తారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మీన రాశి:
సూర్యభగవానుని అనుగ్రహంతో మీన రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయంలో వివాహాలు జరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా కెరీర్‌ సంబంధించిన విషయాల్లో అనేక లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కొత్త ప్రదేశాల్లోకి వెళ్లే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా బాగుటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News