Krithi Shetty: ప్రియమైన వాడికి ముద్దు పెడుతూ.. కెమెరాలకు చిక్కిన కృతి శెట్టి..

Krithi Shetty: కృతి శెట్టి..కేరాఫ్ బేబమ్మ.. ‘ఉప్పెన’ సినిమాలో ఉప్పెనలా టాలీవుడ్ పై ఎగిసిపడ్డ కృతి శెట్టి.. ఆ సినిమాతో  ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతేకాదు తొలి మూడు సినిమాల సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ తో ఈ అమ్మడి క్రేజ్ తగ్గింది. అంతేకాదు వరుసగా ఫోటో షూట్ లను నమ్ముకుంది. తాజాగా ఈ భామ ప్రియమైన వాడికి ముద్దు పెడుతూ కెమెరాకు చిక్కింది. 

1 /7

ఉప్పెన, 'శ్యామ్ సింగరాయ్', బంగార్రాజు వంటి వరుస సక్సెస్ లతో  హాట్రిక్ హిట్స్ అందుకొని టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అయింది కృతి శెట్టి.  ఆ తర్వాత ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.

2 /7

హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ ఫ్లాపులు కృతి శెట్టి కెరీర్‌ను డౌన్ ఫాల్ అయ్యేలా చేసింది. దీంతో ఇపుడు వరుసగా హాట్  ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.

3 /7

మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన'మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి శెట్టి. అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది బేబమ్మ. 

4 /7

కెరీర్ మొదట్లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్స్‌తో హాట్రిక్ భామ అనిపించుకుంది.

5 /7

ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

6 /7

తాజాగా ‘మనమే’ సినిమాలో కనిపించింది. తాజాగా తన పెంపుడు కుక్కను ముద్దాడుతూ దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది. దానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

7 /7

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు చిత్రాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.