7th Pay Commission DA Hike Latest Updates: ఈ ఏడాది రెండో డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర నెలలో కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి నెల నుంచి అమలులోకి వచ్చింది. ఈసారి కూడా ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. మొదటి డీఏ 4 శాతం పెంపుతో మొత్తం 50 శాతానికి చేరింది. మరోసారి కూడా నాలుగు శాతం పెంచే అవకాశాలు ఉండడంతో 54 శాతానికి చేరనుంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు అలవెన్సులు ప్రకటిస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. 5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కరువు భత్యాన్ని 16 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా తొమ్మిది శాతం పెంచినట్లు వెల్లడించారు.
Also Read: Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన
డీఏ పెంపుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనకు కట్టుబడి ఉందని.. ఐదో, ఆరో వేతన స్కేల్ కింద రాష్ట్ర ఉద్యోగుల డీఏ 16 శాతం, పెన్షనర్ల డీఆర్ తొమ్మిది శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో ఐదో పే స్కేల్‌లో డియర్‌నెస్ అలవెన్స్ 427 శాతం నుంచి 443 శాతానికి, ఆరో పే స్కేల్‌లో 230 శాతం నుంచి 239 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత భజన్‌లాల్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపును మార్చిలో ప్రకటించారు. ఆ సమయంలో ఏడో వేతన సంఘం కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగుల డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ కూడా 4 శాతం పెంచారు. ముఖ్యమంత్రి ప్రకటనతో అప్పట్లో 8 లక్షల మంది ఉద్యోగులు, 4.40 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది.
మోదీ 3.O పరిపాలన మొదలవ్వడంతో జీతాల పెంపు త్వరగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. డీఏ 50 శాతానికి మొత్తం డీఏను బేసిక్‌లో కలిపేసి.. మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో కొత్త పే కమిషన్ తీసుకువస్తారా..? లేదా ఇలానే కంటిన్యూ చేస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త పే కమిషన్‌పై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా.. సిఫార్సుల అమలు 2026 నుంచి మొదలుకానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter