Monsoon Diet: ఈ సీజన్లో ఇమ్యూనిటీని పెంచే 6 ఆహారాలు.. మీ డైట్ లో తప్పనిసరిగా ఉండాల్సిందే..

Monsoon Diet: వర్షాకాలం వచ్చింది అంటే వ్యాధుల కాలం కూడా వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాదు డెంగీ, మలేరియా సమస్యలు కూడా వస్తాయి. అయితే వీటిని ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచుకోవడానికి కొన్ని ఆహారాలు ఈ సీజన్లో మీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
 

1 /6

ఉసిరి.. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఉసిరికాయ మామూలుగా మార్కెట్లో మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్లో ఉసిరికాయ మీ డైట్ లో చేర్చుకోవాలి.

2 /6

అల్లం.. అల్లం శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాంతులకు కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది.

3 /6

పసుపు.. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో కర్కూమీన్ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

4 /6

పాలకూర.. పాలకూరలో విటమిన్ ఏ, ఫోలెట్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇవి మన శరీర ఆరోగ్య పని తీరుకు ఎంతో ముఖ్యం ఈ సీజన్లో పాలకూర కూడా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

5 /6

వెల్లుల్లి.. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది ఇది మెటబాలిజం రేటును పెంచేలా చేసి సీజనల్ వ్యాధులు బారిన పడకుండా వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

6 /6

యోగార్ట్‌.. యోగార్ట్‌ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)