మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

Last Updated : Apr 3, 2019, 11:51 PM IST
మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు అప్ కమింగ్ మూవీ మహర్షి టీజర్‌ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో చిత్ర నిర్మాత దిల్ రాజు కానీ లేదా మహేష్ బాబు కానీ గురువారం ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం మహర్షి టీజర్‌ ఉగాది కానుకగా ఈనెల 6న విడుదల కానుందని సమాచారం. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ వర్గాలు గురువారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి సినీవర్గాలు. 

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 9న విడుదల కానుండగా మహేష్‌ బాబు సరసన పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తోంది. అలాగే అల్లరి నరేశ్‌ సైతం మొదటిసారి మహేష్ బాబు సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవిపి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న మహర్షి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Trending News