Reverse Aging Tips: రివర్స్ ఏజింగ్.. ఇది ఎలా సాధ్యం? 75 నుంచి 57 వయసుకి మారిన వ్యక్తి..!

Reverse Aging: డాక్టర్ మైకేల్ అనే వ్యక్తి.. తన వయసుని ఏడు పదుల నుంచి ఐదు పదు లకు తగ్గించుకున్నారు. కేవలం రోజులో ఒక గంట కేటాయించడం ద్వారా.. డాక్టర్ మైక్ కు ఇది సాధ్యమైంది. అసలు ఈ ఒక గంట.. అతను ఏం చేశారు.. ఇలా వయసుని రివర్స్ ఎలా చేసుకున్నారు అనే వివరాలు మీకోసం 

1 /6

వయసు పెరిగే కొద్దీ.. ఆరోగ్య సమస్యలు మన.. మీద పడుతూ వస్తాయి. వయసు పెరుగుతోంది.. అంటే మనమంతా ఆరోగ్యం దెబ్బతింటుందని అనుకుంటాము.  అయితే ఎంతోమంది వైద్యులు, శాస్త్రవేత్తలు వయసు పెరిగినా.. కానీ ఆరోగ్యాన్ని యవ్వనంగానే ఉంచి ఎక్కువ కాలం.. బతకగలము అని చెబుతున్నారు. 

2 /6

ఈ క్రమంలో.. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ చీఫ్ వెల్నెస్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ రాయిజాన్ అసలు వయసు 75 సంవత్సరాలు పైగే అవ్వగా... తన బయోలాజికల్ ఏజ్ ను 20 ఏళ్లకు పైగా తగ్గించుకున్నట్లు.  ఈ మధ్యనే తెలిపారు. అయితే దీనికోసం ఆయన రోజుల్లో కేవలం ఒక గంట సమయం.. స్పెండ్ చేసేవారట

3 /6

సాధారణంగా బయోలాజికల్ వయస్సు అనగా శరీర కణాల వయసు. 50 సంవత్సరాల వయసు వారి.. శరీరకణాలు 20 ఏళ్ల కుర్రాడితో పోలిస్తే  అనారోగ్యంగా ఉంటాయి. అంటే వయసునిబట్టి కణాల ఆరోగ్యం..  మారుతుంది. అయితే మైకేల్ శరీర కణాలు 75 ఏళ్లలోనూ 57 వయసు వారికుండే కణాల్లాగా  ఉన్నాయి. అయితే దీనికోసం.. ఆయన ఎటువంటి మ్యాజిక్ చేయలేదు. కేవలం కొన్ని నియమాలు పాటించారు 

4 /6

ఈమధ్య ఒక మ్యాగజైన్ తో తన వ్యాయామాలను పంచుకున్నారు ఈ డాక్టర్.  వారానికి 3 సార్లు కనీసం 45 నిమిషాల పాటు.  కార్డియో వ్యాయామాలు చేస్తారట. ఆది, బుధు, శుక్రవారం.. ట్రెడ్ మిల్ లేకపోతే, బ్రిస్క్ వాకింగ్ .. రన్నింగ్ లేదా స్విమ్మింగ్ .mకనీసం ఒక గంట పాటు చేసేవారట

5 /6

అంతేకాకుండా కండరాలు బలంగా ఉండదానికి రోజు.. 30 నుంచి 60 నిమిషాల రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకునే వారట. కండరాలు బలంగా ఉండడం.. వల్ల అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఇటీవల ప్రచురితమైన బ్రిటిష్ జర్నల్ స్పోర్ట్స్.. మెడిసిన్ జర్నల్ వెల్లడించింది.

6 /6

ఇక ఈ కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ తో పాటు రోజూ కనీసం పదివేల అడుగులు నడుస్తూ ఉండేవారట ఈ డాక్టర్. ఆఫీస్ కి దూరంగా కారు పార్క్.. చేసి నదవడం లేకపోతే లిఫ్ట్ లేకుండా మెట్లు ఎక్కడం లాంటివి చేసేవారట. దీనివల్ల మెదడు చుడుకుగా పనిచేయదమే కాకుండా డయాబెటిస్ లాంటి అనారోగ్యాలు కూడా దరిచేరవు . మొత్తానికి ఇవన్నీ పాటించి తన బయోలాజికల్ ఏజ్ రివర్స్ చేసుకున్నారు ఈ డాక్టర్