Bangladesh: కట్టుబట్టలతో ప్రధానిని పారిపోయేలా చేసిన 26 ఏళ్ల కుర్రాడు.. నహిద్ ఇస్లామ్ ఎవరో తెలుసా..?

Bangladesh student leader Nahid Islam: బంగ్లాదేశ్ ఉద్యమంలో 26 ఏళ్ల కుర్రాడు  కీలకంగా వ్యవహరించాడు. అతను సహాచరులతో చేపట్టిన ఉద్యమం కారణంగా ఏకంగా పీఎం షేక్ హసీనా కట్టుబట్టలతో దేశం వదిలి పారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నహిద్ గురించి ఎవరంటూ కూడా చాలా మంది ఆరా తీస్తున్నారు. 
 

1 /8

బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలలో, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తిలో పాల్గొన్న వారి కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అధికార అవామీలీగ్ భావించింది. దీన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది చిలికి చిలికి తుఫానులా  మారింది.

2 /8

 ఈ వ్యవహారం కాస్త సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. దీంతో రిజర్వేషన్లను తగ్గిస్తు ధర్మాసనం తీర్పువెలువరించింది. అయిన కూడా అవామీలీగ్ అనేక కుటీల పన్నాగాలు పన్నుతుందని కూడా విద్యార్థులు కదంతొక్కారు. 

3 /8

నిరుద్యోగుల నిరసలు కాస్త వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో.. అవామీలీగ్ ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి కూడా ప్రయత్నించింది. దీంతో నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య గొడవలు సంభవించాయి. ఏకంగా ఆర్మీ కూడా ఇందులో కల్గజేసుకొవడంతో ఉద్యమంతీవ్ర రూపం దాల్చింది. కాల్పులు , వివిధ ఘటనల్లో ఏకంగా 300 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.   

4 /8

ఈ నేపథ్యంలో నిరసనకారులు వేల సంఖ్యలో.. ఏకంగా బంగ్లా రాజధాని ఢాకాను చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి అదుపు తప్పడంతో.. ఆర్మీసూచనలతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిస దేశం వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందారు.

5 /8

ఇదిలా ఉండగా.. ఈ ఉద్యమానికి ప్రస్తుతం 26 ఏళ్ల.. కుర్రాడు.. షేక్ హసీనా నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ప్రధాని పదవికే ఎసరుపెట్టి, ప్రభుత్వాల్ని కూల్చేసింది.  నహిద్ ఇస్లామ్ ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆందోళనల్లో అతను కన్పిస్తున్నాడు.

6 /8

1998 లో నహిద్ బంగ్లా రాజధాని ఢాకాలో జన్మించాడు. అతని తండ్రి ఒక టీచర్.సోదరుడు నఖిబ్. అతను చిన్న తనం నుంచి ఉద్యమ భావాలతో పెరిగినట్లు తెలుస్తోంది. ఎక్కడ అన్యాయం జరిగిన వెంటనే ప్రశ్నించేవాడని కూడా తెలుస్తోంది. అందుకు పోలీసులు పలుమార్లు, నహిద్ ను దారుణంగా బంధించి, కొట్టినట్లు సమాచారం. 

7 /8

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీచీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్, విద్యార్థి లోకం నాయకుడు నహిద్ తో సాయంత్రం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాలో నిరసలను ఆగిపోయి, మలర శాంతి దిశగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఈ చర్యలు ఉంటాయని తెలుస్తోంది.  

8 /8

మరోవైపు విద్యార్థి నాయకుడు నహిద్ మాత్రం.. నోబెల్ గ్రహిత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రతిపాదనతో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.  అదే విధంగా విద్యార్థుల ఆమోదం లేనిదేతాము.. ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని కూడా నహిద్ స్పష్టం చేశాడు.