Marigold Flower Benefits: బంతి పూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఇంటికే అందాన్నిస్తాయి. పూజాది కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగించే బంతి పూలతో ఆరోగ్యపరంగా కూడా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. చాలా వ్యాధులకు బంతి పూలతో చెక్ చెప్పవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
చెవి నొప్పి నుంచి ఉపశమనం... బంతి పూల ఆకుల్నించి తీసిన రసంతో చెవి నొప్పి తగ్గించవచ్చు.
పంటి నొప్పి నుంచి రిలీఫ్... మీ పళ్లలో నొప్పిగా ఉంటే బంతి పూల ఆకుల్ని నీళ్లలో కలిపి ఉడికించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్లతో పుకిలించాలి.
జ్వరం తగ్గిస్తుంది... బంతి పూలతో జ్వరం కూడా తగ్గించవచ్చు. బంతి పూవు రేకులను నీళ్లలో కలిపి ఉడికించాలి. ఆ తరువాత తేనె కలిపి తీసుకోవాలి.
మైగ్రెయిన్ నుంచి ఉపశమనం... బంతి పూలలో మైగ్రెయిన్ నొప్పిని తగ్గించే గుణాలు ఉంటాయి. దీనికోసం బంతి పూలను ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్‌ను గానుగ నూనెలో కలిపి తలకు మాలిష్ చేసుకోవాలి.
చర్మ సంరక్షణ... బంతి పూలను లోషన్, క్రీమ్, లిప్ బామ్ తయారీలో వినియోగిస్తారు. అంటే చర్మ సంరక్షణకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
రోగ నిరోధక శక్తి... బంతి పూలలో విటమిన్ ఎ, విటమిన్ బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బంతి పూలలో ఔషధ గుణాలు... బంతి పూలు కేవలం అలంకరణకే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా లాభదాయకమైంది. ఇందులో ఔషధ విలువలు మెండుగా ఉంటాయి. శరీరంలోని వివిధ భాగాల్లో తరచూ ఎదురయ్యే నొప్పుల్ని తగ్గిస్తాయి.
ఇంటి అలంకరణలో... సాధారణంగా ఇంటిని లేదా పెళ్లిళ్లలో పూల డెకరేషన్ చేసినప్పుడు అందులో ప్రధానంగా కన్పించేవి బంతి పూలే. ఎందుకంటే ఇవి అంత అందంగా ఉంటాయి. ఫ్లవర్ బొకేల్లో కూడా ఎక్కువగా ఇవే ఉంటాయి.