Honey Usage Precautions: తేనెను వేడి నీళ్లలో కలిపి తింటున్నారా, ఆ తప్పు అస్సలు చేయవద్దు

Honey Usage Precautions: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేసేందుకు, అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఎలా సేవించాలనే విషయంలోనే సందిగ్ధత ఉంటోంది. ఆ వివరాలు మీ కోసం.

Honey Usage Precautions: ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు కల్గించే తేనెను ఎలా తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. చాలామంది తేనెను వేడి నీళ్లలో కలిపి తాగుతుంటారు. మీరు కూడా అదే పని చేస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టే..మరెలా తాగాలి..
 

1 /10

అంతేకాకుండా తేనెను వేడి చేసి తినకూడదు.తేనె ఎప్పుడూ నార్మల్ టెంపరేచర్‌లోనే తినాలి

2 /10

తేనెను ఎప్పుడూ నెయ్యిలో సమాన పాళ్లలో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల హాని కలుగుతుంది

3 /10

తేనెను వేడి నీళ్లే కాదు ఏ వేడి పదార్ధాలతో కూడా కలపకూడదు

4 /10

చాలామంది తేనెను వేడి నీటిలో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. వేడి నీటిలో తేనె కలపడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ కలుగుతుంది.

5 /10

ఒకవేళ నీళ్లతో తాగడం ఇష్టం లేకపోతే తేనెను నల్ల మిరియాల పౌడర్ లేదా దాల్చిన చెక్క పౌడర్‌తో కలిపి తీసుకోవచ్చు.  

6 /10

సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీళ్లలో తేనె కలిపి తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.  

7 /10

ఆయుర్వేదం ప్రకారం ఉదయం పరగడుపున తేనె సేవించాలి. దీనివల్ల రెట్టింపు లాభాలుంటాయి.  

8 /10

అయితే ఆయుర్వేదం ప్రకారం తేనెను ఎలా సేవించాలో మీకు తెలుసా..  

9 /10

కొంతమంది బరువు తగ్గించేందుకు, మరి కొంతమంది జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం సేవిస్తుంటారు  

10 /10

ఆయుర్వేదం ప్రకారం తెనెను చాలా రకాల సీరియస్ వ్యాధుల్ని తగ్గించేందుకు ఉపయోగిస్తుంటారు