Yash Toxic: పూజా కార్య‌క్ర‌మాల‌తో బెంగళూరులో ప్రారంభ‌మైన య‌శ్‌ భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్.. ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’..

Yash Toxix Movie Starts With Pooja ceremony: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ తో ఈయన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్యాన్ ఇండియా లెవల్లో యశ్ పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ తో కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ.. తాజాగా టాక్సిక్ మూవీ ఓకే చేసాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బెంగుళూరులో ప్రారంభమైంది.

1 /5

బాక్సాఫీస్ సెన్సేష‌న్ రాకింగ్ స్టార్ య‌శ్ కథానాయకుడిగా భారీ పాన్ ఇండియా మూవీ  ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ ఈ గురువారం రోజున పూజా కార్య‌క్ర‌మాల‌తో బెంగుళూరులో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

2 /5

అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది.

3 /5

తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో హీరో యశ్, నిర్మాత వెంకట్ నారాయణ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు ఈ సినిమా విజయవంతం కావాలని దేవుడిని ప్రార్ధించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఇతర సభ్యులు టీమ్ కు ప్రత్యక అభినందనలు తెలియజేసారు.

4 /5

కెజియ‌ఫ్ త‌ర్వాత య‌శ్‌ ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులు ఈ రోజుతో తెరపడింది.  అలాగే సినిమా ప్రారంభ‌మైన రోజుని న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం చూసిన 8-8-8ను సూచిస్తుంది. ఇది య‌శ్ పుట్టిన‌రోజును కూడా జనవరి 8 తెలియజేస్తుంది.

5 /5

గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న‌ "టాక్సిక్’ ను విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాను ఎమోష‌న‌ల్‌, ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో తెర‌కెక్కించ‌నున్నారు. దీని కోసం స్టార్ యాక్ట‌ర్స్‌, టెక్నిక‌ల్ టీమ్ చేతులు క‌లిపించారు.