Home Loan: హోం లోన్ తీసుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే..అప్పు ముప్పు లేని ఇల్లు మీ సొంతం..!!

Home Loan Tricks: సొంతిల్లు అనేది ప్రతిఒక్కరి కోరిక. తమకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలంటూ కలలు కంటుంటారు. మధ్య తరగతి కుటుంబాలకు ఇది చిరకాల కోరిక. ఈ కోరికను నెరవేర్చుకునేందుకు ప్రతినెలా కొంత పొదుపు చేస్తుంటారు. అయితే ఆ పొదుపు నిర్ణీత మొత్తంలో జమ అయిన తర్వాత హోం లోన్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే హోం లోన్ తీసుకునే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏళ్ల తరబడి హోంలోన్ ఖాతాదారులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంటాయి. అప్పుల బాధ లేకుండా తక్కువ సమయంలోనే మీ సొంతింటి కలను నెరవేర్చుకునేలా నిపుణులు  కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఈవేంటో చూద్దాం. 

1 /7

Home Loan Tricks : హోంలో తీసుకున్న తర్వాత ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలి. ప్రతి ఏటా ఈఎంఐ పెంచితే ఏండ్ల తరబడి అప్పుల బాధ లేకుండా ఓ పదేండ్లలో బయటపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే మొత్తాన్ని ఏటా 10శాతం పెంచితే పదేండ్లలో హోంలోన్ తీరిపోతుందని అంటున్నారు.   

2 /7

హోం లోన్ తీసుకునే వ్యక్తి తన సంపాదనలో 50శాతానికి మించి ఈఎంఐ భారం లేకుండా చూసుకోవాలి. అంతేకాదు ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లిస్తే ఎలాంటి ఫైన్ ఉండదు.   

3 /7

ప్రతినెలా ఈఎంఐ 5శాతం పెంచితే 13ఏండ్లలో హోంలోన్ నుంచి బయటపడవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంతో అసలుతోపాటు వడ్డీ నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.   

4 /7

 ప్రతి ఏడాది ఒక ఈఎంఐను అధికంగా చెల్లిస్తుంటే 25ఏండ్ల వ్యవధిలో ఉన్న లోన్ కేవలం 20ఏండ్లకే తీరుతుందని చెబుతున్నారు. ఒకవేళ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచినా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.   

5 /7

ఏదైనా బ్యాంకులు వడ్డీ తక్కువగా ఇస్తుంటే ఆయా బ్యాంకులకు రుణాన్ని బదిలీ చేస్తే త్వరగా లోన్ తీర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వడ్డీ రేటుతోపాటు ఇతర ఖర్చులను కూడా పరిశీలించిన తర్వాత లోన్ ట్రాన్స్ ఫర్ అంశాన్ని పరిగణలోనికి తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.   

6 /7

హోంలోన్ తీసుకుంటే అందులో మీ భార్య పేరును చేర్చి జాయింట్ లోన్ తీసుకోండి. జాయింట్ లోన్ లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. మహిళల పేరుతో పొందే హోంలోన్స్ 5 బేసిసి పాయింట్లు తక్కువ వడ్డీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.   

7 /7

మీరు హోంలోన్ తీసుకున్నప్పుడు హోంలోన్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. కష్టసమయాల్లో మీ కుటుంబ సభ్యులకు సహాయంగా ఉంటుంది.  హోంలోన్ వడ్డీ రేట్లు మారుతున్నప్పుడు ముఖ్యంగా వడ్డీ రేటు పెరిగినప్పుడు మీరు బ్యాంకును సంప్రదించి హోంలోన్ తిరిగి తీసుకోవాలి. ఏకారణంగా అయినా లోన్ కాలాన్ని పొడిగించవద్దు. ఈ ట్రిక్స్ ఫాలో అయితే కనీసం లక్ష రూపాయల వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు.